అమెరికాలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడి కాల్చివేత

అమెరికాలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడి కాల్చివేత

అమెరికాలో జరిగిన గ్యాంగ్​ వార్ లో గ్యాంగ్ స్టర్​ లారెన్స్​ బిస్ణోయ్​ముఖ్య అనుచరుడు చనిపోయాడు.  ఆదివారం( జవనరి 11)  ఇండియానాలో  లారెన్స్​ బిష్ణోయ్​ గ్యాంగ్​ కు, ప్రత్యర్థి రోహిత్​ గోదారా గ్యాంగ్​ మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో బిష్ణోయ్​ అనుచరుడు, హర్యానాకు చెందినవీరేంద్ర సాంభి మృతిచెందారు. కాల్పుల్లో  వీరేంద్ర సాంభి శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ కాల్పుల్లో  మరో వ్యక్తి కూడా  మృతిచెందాడు. వీరేంద్ర సాంభూను తామే చంపినట్లు రోహిత్​ గోదారా అనుచరులు బల్జోత్​సింగ్, జల్సాలు ప్రకటించారు. అయితే సాంభూ హత్యపై ఇప్పటివరకు అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇదిలా ఉంటే.. రోహిత్​ గోదారా గ్యాంగ్​ కు చెందిన ఓ గ్యాంగ్​స్టర్​ను సోమవారం ( జనవరి 12) ఢిల్లీలో అరెస్ట్​ చేశారు. చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న హర్యానాకు చెందిన గ్యాంగ్​ స్టర్​ వికాస్​ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వికాస్​ అనేక క్రిమినల్​ కేసుల్లో మోస్ట్​ వాంటెడ్​ క్రిమినల్.. అతనిపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. ఢిల్లీలోని చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఆయుధాల అక్రమ రవాణా చట్టం కింద వికాస్‌ను అరెస్టు చేశారు.  

రోహిత్​ గోదారా గ్యాంగ్.. 

రాజస్థాన్​ లోని బికనీర్​ కు చెందిన రోహిత్​ గోదారా ఈ గ్యాంగ్​ కు లీడర్​.. గతంలో బిష్ణోయ్​ కి సన్నిహితుడు.బిష్ణోయ్​ , గోల్డీ బ్రార్​ క్రిమినల్ నెట్ వర్క్​ లో ఓ భాగం. తర్వాత స్వతంత్రంగా గ్యాంగ్​ ను నడుపుతున్నాడు. కెనడా, అజర్​ బైజన్​ వంటి పలు దేశాలనుంచి గ్యాంగ్​ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.దోపిడీలు, హత్యలు,  ఆయుధాల అక్రమ రవాణాలో పాల్గొంటున్నారు రిపోర్టులు చెబుతున్నాయి. గతేడాది నవంబర్​ లో  రోహిత్​ గోదారా గ్యాంగ్​ కు చెందిన ఇద్దరు సభ్యులను హర్యానా పోలీసులు అరెస్ట్​చేశారు. 

►ALSO READ | నేనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని.. ట్రంప్ సంచలన ప్రకటన..