మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, మాస్ యాక్షన్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu). ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు సోమవారం (2026 జనవరి 12న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా, కేథరిన్ థ్రెసా మరో కీలక పాత్ర పోషించింది. విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ చేశాడు. సాహు గారపాటి, మెగా డాటర్ సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సంగీతం అందించారు.
‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో.. చిరంజీవి చాలా కాలం తర్వాత పవర్‌ఫుల్ వింటేజ్ లుక్‌లో, యంగ్ ఏజ్ ఎనర్జీతో కనిపించడం ఫ్యాన్స్‌కు పెద్ద ప్లస్‌గా మారింది. దానికి తగ్గట్టుగానే దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్దపీట వేశాడనే టాక్ ప్రీమియర్స్ నుంచే వినిపిస్తోంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ షోలు పూర్తవ్వగా, థియేటర్ల నుంచి వస్తున్న రియాక్షన్స్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో,‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫుల్ రివ్యూలో కథ & కథనం, డైరెక్షన్, నటీనటుల నటన, టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ పనితీరు ఎలా ఉన్నాయో ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం..
కథేంటంటే:
శంకర వరప్రసాద్ (మెగాస్టార్ చిరంజీవి) ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన టీమ్(కేథరీన్, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం). దేశ భద్రతే తన జీవితం అనుకునే వ్యక్తి శంకర వరప్రసాద్. కానీ అదే క్రమంలో, శంకర వరప్రసాద్ తన కుటుంబ జీవితాన్ని పూర్తిగా కోల్పోతాడు. అతని భార్య శశిరేఖ (నయనతార) – ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత, అతని వల్ల విసిగిపోయి విడాకులు తీసుకుంటుంది. అలా తన తండ్రి, పెద్ద బిజినెస్ టైకూన్ జీవీఆర్ (సచిన్ ఖేడ్కర్) దగ్గరకి వెళ్లిపోతుంది. ఇద్దరు పిల్లలను కూడా వరప్రసాద్‌కు దూరం చేస్తుంది. ఆరు సంవత్సరాలుగా పిల్లలను చూడలేక, భార్యను కోల్పోయి, మానసికంగా పూర్తిగా ఒంటరిగా మారిపోతారు వరప్రసాద్.
ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోం మంత్రి నితీష్ శర్మ (శరత్ సక్సేనా), తన ప్రభావంతో ఒక ప్లాన్ వేస్తాడు. వరప్రసాద్‌ను పిల్లలు చదువుతున్న బోర్డింగ్ స్కూల్‌లో పీఈటీ టీచర్‌గా పంపిస్తాడు. తండ్రిపై ద్వేషంతో ఉన్న పిల్లలు అతడిని అసలు గుర్తించరు. కానీ క్రమంగా అతని నిజమైన ప్రేమ, త్యాగం వాళ్ల మనసుల్లో మార్పు తెస్తుంది.
ఇదే సమయంలో కథలోకి ఎంటర్ అవుతాడు వెంకీ గౌడ (విక్టరీ వెంకటేష్) – ఒక మైనింగ్ బిజినెస్ టైకూన్. శశిరేఖతో అతనికి ఉన్న సంబంధం, వారి గతం, దీనివల్ల వరప్రసాద్ కుటుంబంపై వచ్చిన మార్పులు.. ఇవన్నీ కథను కీలక మలుపులవైపు తీసుకెళ్తాయి.
అసలు శశిరేఖ – వరప్రసాద్ విడిపోవడానికి గల కారణం ఏంటి? వెంకీ గౌడ పాత్ర.. పాజిటివ్‌నా లేదా నెగటివ్‌నా? తండ్రిగా వరప్రసాద్ తన పిల్లల మనసులను తిరిగి ఎలా గెలుచుకున్నాడు? చివరికి శనిరేఖ, వరప్రసాద్ మళ్లీ కలిశారా లేదా? అనే తదితర విషయాలు తెలియాలంటే.. మూవీ థియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ:
మొత్తంగా చూస్తే, ఈ సినిమాతో వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తిగా సక్సెస్ అయ్యాడు. చిరంజీవి రీఎంట్రీ తర్వాత ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా మిస్ అవుతున్న ఎనర్జిటిక్, కామెడీ టైమింగ్ ఉన్న చిరు ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాడు. ఈ విషయంలో గతంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో దర్శకుడు బాబీ కొంతవరకు సక్సెస్ అయితే, ఈ సినిమాతో అనిల్ రావిపూడి వంద మార్కులు కొట్టేశాడని చెప్పొచ్చు. చిరంజీవిని స్టార్‌గా కాకుండా ఒక పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా మలిచిన విధానం సినిమాకి పెద్ద ప్లస్.
అయితే, కథ & కథనం విషయంలో దర్శకుడు కొంచెం బలహీనంగా అనిపిస్తాడు. ఎమోషనల్ సీన్స్ పూర్తిగా కనెక్ట్ కావు. సినిమా మొత్తం కూడా టిపికల్ అనిల్ రావిపూడి సంక్రాంతి టెంప్లేట్‌లోనే సాగుతుంది. అక్కడక్కడా ప్రిడిక్టబుల్‌గా అనిపించినా, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం తగ్గదు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి మరో బలమైన ప్లస్. ఆడియోలోనే ఆకట్టుకున్న పాటలు, తెరపై మరింత మెరుపులు మెరిపిస్తాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండి ఉంటే బాగుండేదన్న భావన మిగులుతుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చిరంజీవిని స్టైలిష్‌గా, యంగ్‌గా చూపించడంలో కెమెరా వర్క్ సినిమాకి మంచి విలువను జోడించింది.
ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పుకోవాలి. చక చకా సీన్స్ వస్తూనే నవ్వులు పూయిస్తాయి. సినిమా మొదలైన వెంటనే చిరంజీవి ఎంట్రీ ఆకట్టుకుంటుంది. తొలి ఫైట్‌తోనే ఆయనకు ఇచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తుంది. వెంటనే వచ్చే హుక్ స్టెప్ సాంగ్ జోష్‌ను మరింత పెంచుతుంది. కథ మొదట సెక్యూరిటీ, మంత్రి ప్రాణహాని వంటి సీరియస్ టోన్‌లో మొదలైనా.. ఫస్ట్ ఫైట్ పూర్తయ్యాక అది కాస్త స్మూత్‌గా భార్యాభర్తల కథగా మారిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మెలోడీ నడుస్తుండగా, శంకరవరప్రసాద్-శశిరేఖ దగ్గరయ్యే సన్నివేశాల వైనం సరదాగా చూపించిన విధానం నవ్విస్తుంది.
అంతేకాదు.. ఈ జంట విడిపోయే సన్నివేశాల్ని కూడా దర్శకుడు అనిల్ కామెడీ యాంగిల్లోనే తెరకెక్కించాడు. ఆ తర్వాత స్టోరీ స్కూల్‌కి మారడం, అక్కడ బుల్లిరాజు (ఎస్‌పీఎల్ పాత్ర) చేసే హడావుడి, అడవిలో కుక్కపిల్ల కోసం వేట, అనుకోకుండా శశిరేఖ స్కూల్‌కు రావడం.. ఇలా మొత్తం ఫస్ట్ హాఫ్ సరదాగా, లైట్ టోన్‌లోనే సాగిపోతుంది. పిల్లల నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్‌లో ఎమోషన్ పండుతుంది.
అయితే, సెకండ్ హాఫ్ మిక్స్‌డ్ ఫీలింగ్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథలో పట్టు తగ్గిపోయిన ఫీలింగ్ ఇస్తుంది. ఇన్వెస్టిగేషన్ అంటూ వచ్చే సీన్స్, అక్కడక్కడే తిరుగుతూ ఉండటం సాగదీతగా అనిపిస్తాయి. కానీ, కథలో వెంకటేష్ ఎంట్రీతో మళ్లీ సినిమా ఊపందుకుంటుంది. అప్పటినుంచి కథ కంటే కూడా చిరు-వెంకీ జోడీని చూడటమే స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోతుంది. వాళ్లిద్దరి మధ్య వచ్చే సంక్రాంతి సాంగ్ తో మెగా ఆడియన్స్ స్టెప్పులు వేస్తూ, విజిల్స్ వేసేలా ఉంది.
అలాగే, ఎమ్.ఎమ్.ఎస్ అంటూ వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఆడియెన్స్‌కు కావాల్సినంత సందడిని పంచేలా ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్, ఎమోషనల్‌గా బాగా వర్క్ అయ్యేలా ఉంది. మొత్తానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ కథలో కొత్తదనం కాకపోయినా, సంక్రాంతి పండగకి సరిపోయే ఒక ఫుల్-ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిరంజీవి వింటేజ్ స్టైల్‌లో నవ్వులు, ఎమోషన్, డ్యాన్స్, యాక్షన్ అన్నీ అందిస్తూ అనిల్ దట్టించిన సినిమా ఇది.
నటి నటుల పనితీరు:
సినిమా ఆద్యంతం చిరంజీవి తన భుజాలపై మోసాడని చెప్పాలి. చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్, డ్యాన్స్ లో గ్రేస్ బాగా వర్కౌట్ అయ్యాయి. నయనతార తన పాత్రకి వందశాతం న్యాయం చేసింది. క్యామియోలో కనిపించిన వెంకటేష్ తెరపై ఉన్నంతవరకు ఎనర్జిటిక్గా అనిపిస్తుంది. అభినవ్ గోమటం, హర్షవర్ధన్, క్యాథరిన్ లను సరిగా వాడుకోలేదు డైరెక్టర్. ఓవరాల్ గా చెప్పాలంటే మన శంకర వరప్రసాద్ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్.. పైసా వసూల్ సినిమా
సినిమా మొత్తం చిరంజీవి తన భుజాలపైనే మోసుకెళ్లాడని చెప్పాలి. ఆయన మార్క్ కామెడీ టైమింగ్, డ్యాన్స్‌లో గ్రేస్, స్క్రీన్ ప్రెజెన్స్..అన్నీ కూడా బాగా వర్క్ అయ్యాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చిరుని చూసి ఎంజాయ్ చేసేలా సినిమా నిలబడుతుంది. నయనతార తన పాత్రకు వందశాతం న్యాయం చేసింది. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన సహజంగా, నమ్మదగినట్టుగా ఉంటుంది.
క్యామియోలో కనిపించిన వెంకటేష్ తెరపై ఉన్నంతవరకు సినిమా ఎనర్జీ ఒక్కసారిగా పెరుగుతుంది. ఆయన ఎంట్రీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడం ఖాయం. అయితే, అభినవ్ గోమటం, హర్షవర్ధన్, క్యాథరిన్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులను దర్శకుడు అనిల్ పూర్తిగా వినియోగించుకోలేకపోయినట్టు అనిపిస్తుంది. వీరికి మరింత బలమైన సీన్స్ ఉండి ఉంటే సినిమా ఇంకా బలపడేదని భావన కలుగుతుంది.
టెక్నీకల్ అంశాలు:
భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకు బలమైన ప్లస్. పాటలు వినడానికి మాత్రమే కాదు.. తెరపై చూస్తే ఇంకా బాగా వర్క్ అయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విజువల్ ట్రీట్‌లా నిలిచాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. చిరంజీవిని స్టైలిష్‌గా, యంగ్‌గా చూపించడంలో కెమెరా వర్క్ చాలా ప్రభావవంతంగా ఉంది. తమ్మి రాజు ఎడిటింగ్ కూడా క్లీన్‌గా ఉంది. సన్నివేశాలు ఎక్కువగా ల్యాగ్ కాకుండా, సినిమా స్మూత్‌గా ముందుకు సాగుతుంది.
దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన రైటింగ్ పవర్‌ను ప్రూవ్ చేశాడు. కథ పాతదే అయినా, దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్మాట్‌లో, లైట్ టోన్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను చక్కగా మిక్స్ చేశాడు. కానీ, బలహీనమైన కథ ఉండటమే పెద్ద మైనస్.
ఇకపోతే, నిర్మాణ విలువలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమా ఎక్కడా తక్కువ బడ్జెట్‌గా అనిపించకుండా, రిచ్ లుక్‌తో కనిపిస్తుంది. మొత్తానికి, టెక్నికల్‌గా కూడా ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఒక సాలిడ్ సంక్రాంతి ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.
