ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోషయ్య సతీమణి శివ లక్ష్మి (86)కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో భాదపడుతోన్న ఆమె జనవరి 12న ఉదయం అమీర్ పేటలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ఆమె నివాసానికి వెళ్లి నివాళి అర్పి్స్తున్నారు.
మాజి సీఎం రోశయ్య 2021లో డిసెంబర్ 4న కన్నుమూశారు. . రోశయ్య 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్యను తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.
