ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) టెక్నీషియన్, సూపర్‌వైజర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ జనవరి 20.
ఖాళీలు: 20.
విభాగాల వారీగా ఖాళీలు: టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ (సీఎన్సీ ఆపరేటర్) మెషినిస్ట్ 04, టర్నర్ 02, గ్రైండింగ్ 02, జిగ్ బోరింగ్ మెషీన్ ఆపరేటర్ 01, సీఎంఎం ఆపరేటర్ 02, వెల్డర్ 02, సూపర్ వైజర్ ఆన్ కాంట్రాక్ట్ (సీఎన్సీ ప్రోగ్రామింగ్) 04, మెయింటెనెన్స్ 01, డ్రాఫ్ట్స్‌మెన్ సూపర్‌వైజర్ (3డి మోడలింగ్ అండ్ డ్రాఫ్టింగ్) 03.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ట్రేడులో ఐటీఐ/ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 35 ఏండ్ల మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. ఎలాంటి ఫీజు లేదు.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 06.
లాస్ట్ డేట్: జనవరి 20.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా పోస్టులను అనుసరించి 1: 4 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఖాళీలు: 04 (ప్రాజెక్ట్ ఇంజినీర్ ఆన్ కాంట్రాక్ట్) .
విభాగాలు: ఫ్రంట్ ఎండ్ డెవలపర్ 1, బ్యాక్ ఎండ్ డెవలపర్ 1, మొబైల్ యాప్ డెవలపర్ 1, డెవ్ అప్స్, ఫుల్‌స్టాక్ డెవలపర్/ డేటాబేస్ 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి కనీసం 60 శాతం మార్కులతో సీఎస్ఈ/ ఐటీ/ ఈసీఈ/ ఈఈఈలో బి.టెక్./బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది.
గరిష్ట వయోపరిమితి: 33 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 6,
లాస్ట్ డేట్: జనవరి 20.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫైనల్ మెరిట్: బి.టెక్./ బీఈలో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ, పని అనుభవానికి 30 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 50 శాతం మార్కుల వెయిటేజీ ఉంటుంది.
పూర్తి వివరాలకు www.ecil.co.in https://www.ecil.co.in/వెబ్‌సైట్‌ను సందర్శించండి.
