ITRA లో టీచింగ్ పోస్టులు .. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం

 ITRA లో  టీచింగ్ పోస్టులు .. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద (ITRA) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ డైరెక్టర్ మరియు ఫార్మాస్యూటికల్ కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 13
అర్హత: ఆయుర్వేదంలో డిగ్రీ, ఎండీ/ ఎంఎస్ (ఆయుర్వేద), పీహెచ్‌డీ కలిగి ఉండాలి. సంబంధిత రాష్ట్ర/ కేంద్ర బోర్డు లేదా కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వీటితోపాటు జాతీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత లేదా ఆయుర్వేదం/ ఫార్మసీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎం.ఫార్మా/ ఎం.ఎస్సీ) పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: ఏప్రిల్ 12.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల స్క్రీనింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సాలరీ: అకడమిక్ లెవల్-14 (రూ. 1,44,200-2,18,200), అకడమిక్ లెవల్-13-A (రూ. 1,31,400-2,17,100), అకడమిక్ లెవల్-10 (రూ. 57,700-1,82,400), లెవల్-11 (రూ. 67,700-2,08,700)
మరిన్ని వివరాలకు www.itra.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

►ALSO READ | ఎన్ఐఏబీలో.. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్