ఎలక్ట్రోలైట్స్తో బాడీకి రీచార్జ్!

ఎలక్ట్రోలైట్స్తో బాడీకి రీచార్జ్!

తిమ్మిర్లు, కండరాలు మెలితిప్పినట్టు ఉండడం, నిరంతరం అలసటగా ఉంటే.. అది ఒత్తిడి లేదా వర్క్ లోడ్ వల్ల కాదు. ఎలక్ట్రోలైట్ స్థాయిలు సరిగా లేనప్పుడు కూడా ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు ఎక్స్​పర్ట్స్. ఈ సమస్యలు తీవ్రమైతే ఎన్నో అనర్థాలకు దారితీయొచ్చు అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి అసలు ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? శరీరంలో అవి చేసే పనేంటో వివరంగా తెలుసుకుందాం. 

ఎలక్ట్రోలైట్లు అనేవి రక్తం, శరీర ద్రవాలలో ఉండే మినరల్స్. ఇవి విద్యుత్ చార్జ్‌‌ను కలిగి ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. ఈ నాలుగు మినరల్స్​ నరాల సంకేతాలు, కండరాలు సంకోచించడం, బాడీలో హైడ్రేషన్​, గుండె లయను రెగ్యులేట్ చేస్తుంటాయి. ఈ ఎలక్ట్రోలైట్స్​ కాస్త బ్యాలెన్స్ తప్పినా వీటి పనితీరులో అంతరాయాలు కలుగుతాయి. దాంతో ఏమీ చేయకపోయినా కండరాల నొప్పులు, బలహీనత లేదా అధిక అలసటకు దారితీస్తాయి. అందుకే ఎలక్ట్రోలైట్‌‌లను బాడీ వైరింగ్ సిస్టమ్​గా భావించాలి. వాటి స్థాయిలు పడిపోయినప్పుడు లేదా చాలా పెరిగినప్పుడు సిగ్నల్స్​లో మార్పులు వస్తాయి.

 అవసరం లేనప్పుడు కూడా కండరాలు సంకోచిస్తుంటాయి. చికాకు కలుగుతుంది. గుండె సక్రమంగా కొట్టుకోకపోవచ్చు. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్​హెచ్​) ప్రకారం.. సోడియం, పొటాషియం అసమతుల్యత మెదడు, కండరాల పనితీరు, గుండె లయను ప్రభావితం చేస్తుంది. మామూలుగా ఒత్తిడి వల్ల కూడా కండరాల బిగుతు, అలసట, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తుంటాయి. కానీ, ఒక తేడా ఉంది. ఒత్తిడి సంబంధిత అలసట తరచుగా విశ్రాంతిని మెరుగుపరుస్తుంది. 

అలాగే హైడ్రేషన్, ఎమోషనల్​ రికవరీ చేయడంలో సాయం చేస్తుంది. నిద్రపోయినప్పటికీ ఎలక్ట్రోలైట్ సంబంధిత లక్షణాలు కొనసాగొచ్చు. వ్యాయామం తర్వాత లేదా లేట్ నైట్​లో అవి తీవ్రమవుతాయి. ఈ మోడర్న్​ లైఫ్​లో ఎక్కువ గంటల వల్ల ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఇదే టైంలో నీళ్లు తక్కువ, కెఫిన్ ఎక్కువగా తీసుకోవాలి అనిపిస్తుంటుంది. ఫలితంగా శరీరంపై రెట్టింపు భారం పడుతుంది. 

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత అనారోగ్యం వల్ల మాత్రమే రాదు. రోజువారీ అలవాట్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఢిల్లీలోని అపోలో హాస్పిటల్స్​లో సీనియర్​ కన్సల్టెంట్​ డాక్టర్ రాకేశ్​ గుప్తా “నేటి వేగవంతమైన జీవనశైలిలో చెమట ఎక్కువగా పట్టడం, డైటింగ్ సరిగా లేకపోవడం, అధిక కెఫిన్ తీసుకోవడం, కొన్ని మందులు ఎలక్ట్రోలైట్ స్థాయిలను నిశ్శబ్దంగా తగ్గిస్తాయి” అని హెచ్చరించారు.

సాధారణ లక్షణాలు

సరైన హైడ్రేషన్ లేకుండా హెవీ ఎక్సర్​సైజ్​లు. వేడి వాతావరణంలో ఎక్కువ సమయం ఉండడం. తరచుగా కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్​ తాగడం. తక్కువ కార్బ్ లేదా తక్కువ ఉప్పు ఆహారాలు తీసుకోవడం. మూత్రవిసర్జన లేదా కొన్ని రక్తపోటు మందులు వాడడం. పదేపదే వాంతులు లేదా విరేచనాలు వంటివి కనిపిస్తాయి. ముఖ్యంగా వేడి ఉష్ణోగ్రతలలో డీహైడ్రేషన్​కి దారితీస్తుంది. కండరాల తిమ్మిరి, అలసట ప్రమాదాన్ని పెంచుతుంది. డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సెంటర్ ఒక వ్యక్తికి తేలికపాటి డీహైడ్రేషన్ ఉన్నప్పటికీ అది సోడియం, పొటాషియం సమతుల్యతను దెబ్బతీస్తుంది. మనదేశంలో ఏడాదిలో చాలా రోజులు వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటిగ్రేడ్​ కంటే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
 
అప్పుడప్పుడు వణుకు పుట్టడం ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ పదే పదే ఆ లక్షణాలు కనిపిస్తే శ్రద్ధ తీసుకోవాలి. “ముఖ్యంగా తల తిరగడం, దడ లేదా తిమ్మిరితో పాటు పదే పదే సంభవించే వణుకును పట్టించుకోకుండా ఉండొద్దు. సాధారణ రక్త పరీక్షలతో ఆ సమస్యను ముందుగానే గుర్తించొచ్చు” అని డాక్టర్ గుప్తా చెప్పారు. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత తీవ్రమైతే మూర్ఛ లేదా గుండె దడ సమస్యలకు దారితీస్తుంది. అందుకే ముందస్తుగా గుర్తించడం ముఖ్యం. 

వృద్ధుల్లో సోడియం స్థాయిలు పడిపోవడానికి కారణమవుతాయి. అథ్లెట్​లలో పొటాషియం తగ్గితే పనితీరు, గుండె లయపై ప్రభావం పడుతుంది. కాబట్టి అలాంటివాళ్లు ఇలా చేయాలి. డీహైడ్రేషన్ కాకుండా ఓరల్ రీహైడ్రేషన్​ సొల్యూషన్స్ తీసుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలో మెడికేషన్స్ తప్పనిసరి. పొటాషియం ఎక్కువగా ఉండే అరటి, పాలకూర, పప్పులు తినాలి. మెగ్నీషియం ఎక్కువగా ఉండే నట్స్, సీడ్స్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఐవీ ఫ్లూయిడ్స్ అవసరం అవుతాయి. 

అయితే, సోడియం తగ్గిందని గుడ్డిగా ఉప్పు తీసుకోవాలనుకోవడం సరికాదు. సోడియం ఎక్కువైతే బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. కిడ్నీ ఫంక్షన్​ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఏదైనా బ్యాలెన్స్​డ్‌​గా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ‘ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇచ్చిన డైటరీ గైడ్​లైన్స్’​ అనుసరించి బ్యాలెన్స్​డ్‌ మినరల్స్ తీసుకోవాలి. 

నివారణ 

  • దాహం వేసినప్పుడు మాత్రమే కాదు.. తరచూ నీళ్లు తాగాలి. హైడ్రేషన్ మెయింటెయిన్ చేయాలి.
  • తినే ఫుడ్​లో నేచురల్​గా పొటాషియం ఉండేలా చూసుకోవాలి.
  • కెఫిన్​ తగ్గించాలి.
  • ఎప్పుడు పడితే అప్పుడు ఎలాపడితే అలా ఫుడ్ తీసుకోవడం కరెక్ట్ కాదు.
  • హెవీ ఎక్సర్​సైజ్​లు చేసేటప్పుడు అవసరమైన ఫ్లూయిడ్స్ తాగాలి.
  • సప్లిమెంట్స్ తీసుకోవడానికి ముందు మెడికల్ అడ్వైజ్ తీసుకోవాలి.
  • చెమట ఎక్కువగా వచ్చే వాళ్లు, కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలకు మందులు వాడేవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.