పునర్వసు వేళ భద్రగిరి ప్రదక్షిణ 

పునర్వసు వేళ భద్రగిరి ప్రదక్షిణ 

భద్రాచలం,వెలుగు: శ్రీరాముడి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా శనివారం భద్రగిరి ప్రదక్షిణ భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్​రావు ఆధ్వర్యంలో భక్తులు శ్రీరాముడి ఫొటోతో మూడుసార్లు భద్రగిరి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. రామపాదుకలకు భద్రుడి మండపంలో పంచామృతాలతో అభిషేకం చేసి, మూలవరులకు గర్భగుడిలో బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు. సీతారాముల కల్యాణమూర్తులకు బేడా మండపంలో నిత్య కల్యాణం చేసి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం దర్బారు చేసి సీతారామయ్యకు దివిటీ సలాం ఇచ్చారు. హైదరాబాదుకు చెందిన డా.కవిత ఆలయానికి రూ.1,59,300 విలువైన మూడు కంప్యూటర్లను విరాళంగా ఈవోకు అందజేశారు.