చంద్రగ్రహణం ప్రభావం అధికంగా ఉంటుంది. మార్చి 3 న ఏర్పడే చంద్రగ్రహణం సింహ రాశిలో కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఎఫెక్ట్ అన్ని రాశుల వారిపై ఉన్నా ..ముఖ్యంగా.. మఘ, పుబ్బ, ఉత్తర నక్షత్ర జాతకుల వారికి వృషభం, సింహం, కన్యా, మకర రాశులపై అధికంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చంద్రగ్రహణ సమయంలో ఏర్పడిన చెడు ప్రభావాన్ని తొలగించుకోవడానికి.. చంద్రగ్రహణం తరువాత స్నానం . కొన్ని వస్తువులు దానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . .
మేషరాశి : గోధుమలు, బంగారం, పప్పు, చందనం, ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రాలను దానం చేయాలి. గోమాతకు గోధుమలు తినిపించాలి
వృషభ రాశి : బియ్యం, పాలు, పంచదార, తెల్లని పువ్వులు, తెలుపు రంగులో ఉండే వస్త్రాలు
మిథున రాశి : కూరగాయలు, పండ్లు, పూలు, బట్టలు.. ఆ తరువాత పరమేశ్వరునికి తేనెతో అభిషేకం
కర్కాటక రాశి : ముత్యాలు, అన్నం, పాలు, నెయ్యి, కర్పూరం, తెల్లని పువ్వులుదానం చేయాలి. శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
సింహ రాశి : రామ మందిరంలో గోధుమలు, ఆవనూనె, ఎర్రని వస్త్రాలను దానం చేయాలి.
కన్యా రాశి : నెయ్యి, కర్పూరం, జీడిపప్పు, తాజా కూరగాయలు, పండ్లు, పూలను శివాలయంలో దానం చేయాలి.
తులా రాశి : కర్పూరం, పంచదార, నెయ్యి, కూరగాయలు, పండ్లు, పూలు, గోధుమలు, వస్త్రాలు
వృశ్చిక రాశి: పేదలకు గుమ్మడికాయ, బెల్లం, ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రం దానం.
ధనుస్సు రాశి : పండ్లు, పువ్వులు, నెయ్యి, గోధుమ, ఉప్పు, పంచదార
మకర రాశి : నల్ల నువ్వులు. నల్ల బట్టలు, నువ్వల నూనె దానం చేయాలి. తరువాత గోమాతకు తోటకూర తినిపించాలి.
కుంభ రాశి : బియ్యం, గోధుమలు, ఉప్పు, పంచదార, బట్టలు, పండ్లు, పువ్వులు
మీన రాశి : పండ్లు, పసుపు బట్టలు, కుంకుమ, పసుపు, బెల్లం
12 రాశుల వారు గ్రహణం తరువాత రోజు శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి.. కేతువును.. చంద్రుడిని పూజించాలి. పరమేశ్వరునికి అభిషేకం చేయాలి. రావి చెట్టుకు 21 ప్రదక్షిణములు చేయాలి. అవకాశం ఉన్న వారు గ్రహణం తర్వాత నదీస్నానంచేయడం గొప్ప పుణ్యమని, దోషాలు అన్ని పోతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
