చేవెళ్లలో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తినష్టం

చేవెళ్లలో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తినష్టం

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శంకర్‌పల్లి రోడ్డులో ఉన్న రిషిత ఆటోమొబైల్స్ అండ్ సప్లయర్స్ అనే గోదాంలో షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగాయి. గోదాంలో హీరో హోండాకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. 

ఇక్కడి నుంచే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆటోమొబైల్స్‌కు సప్లై చేయడం జరుగుతుంది. దాదాపు రెండు కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఫైర్ ఇంజన్‌తో మంటను ఆర్పేశారు. ఈ ఘటన రాత్రి జరిగింది కాబట్టి ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.