కందుకూరు, వెలుగు: ప్రభుత్వ పెద్దల హస్తంతో భూదాన్భూములను అమ్ముతున్నారని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆరోపించారు. కందుకూరు మండలం తిమ్మాపూర్పరిధి సర్వే నంబర్లలోని135 ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నట్లు తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని బుధవారం స్థానిక తహసీల్దార్ఆఫీస్ ముందు కాంగ్రెస్ లీడర్లతో నర్సింహారెడ్డి నిరసన చేపట్టారు.
పోలీసులు అతనితోపాటు కాంగ్రెస్ లీడర్లను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.

