SRH vs CSK: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అదరగొట్టింది. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 10 పరుగుల తేడాతో మట్టికరిపించి, తన కోటలో జెండా పాతేసింది. 195 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాటర్లు పోరాడినప్పటికీ, హైదరాబాద్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక తలవంచక తప్పలేదు.
అభిషేక్ శర్మ ‘ఫైర్’.. క్లాసెన్ ‘క్లాస్’:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ పూనకాలు తెప్పించే ఆరంభాన్ని అందించాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు బాది, ఈ సీజన్‌లో 'ఫాస్టెస్ట్ ఫిఫ్టీ' రికార్డు సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో (59 పరుగులు) బౌండరీల వర్షం కురిసింది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (59) తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 194/9 భారీ స్కోరు సాధించింది.
తడబడిన చెన్నై:
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే షాకులు తగిలాయి. స్టార్ ప్లేయర్లు సంజూ శాంసన్ (7), రుతురాజ్ గైక్వాడ్ (19) త్వరగానే అవుట్ కావడంతో సీఎస్కే ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. ఆయూష్ మాత్రే (30), సర్ఫరాజ్ ఖాన్ (25) కాసేపు మెరుపులు మెరిపించినా.. కీలక సమయంలో వికెట్లు పడటంతో చెన్నై ఒత్తిడిలో పడింది. 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. దీంతో మాథ్యూ షార్ట్ (34) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా ఎషాన్ మలింగ వేసిన బంతికి అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శివమ్ దూబే (21) పరుగులు చేయడానికి తెగ కష్టపడ్డాడు కానీ, సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో జేమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ పోరాడినా హైదరాబాద్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. కాగా హైదరాబాద్ బౌలర్లలో ఎషాన్ మలింగ తన స్పెల్‌తో 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లతో చెన్నై నడ్డి విరిచాడు. సాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్, ప్రపుల్ హింగే తలో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Holding their nerves and jumping into the Top 4⃣ on the points table 🧡@SunRisers make it 🔙 to 🔙 victories with a last-over win against #CSK 👏
— IndianPremierLeague (@IPL) April 18, 2026
Scorecard ▶️ https://t.co/uJG04r8iXD #TATAIPL | #KhelBindaas | #SRHvCSK pic.twitter.com/8EdGMHWgPA

