V6 News

ఇంటిని అద్దెకిస్తే ఇలాగేనా చేసేది.. ఓనర్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన రెంటర్స్.. ఇంటర్నెట్ లో సీరియస్ చర్చ

ఇంటిని అద్దెకిస్తే  ఇలాగేనా చేసేది.. ఓనర్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన రెంటర్స్.. ఇంటర్నెట్ లో సీరియస్ చర్చ

హోం షేరింగ్..ఇప్పుడు ఇది హైదరాబాద్ వంటి బిజీ నగరాల్లో ట్రెండింగ్ లో ఉన్న అద్దె విధానం.. నగరానికి పనిమీద వచ్చి వేళ్లే ఇతర ప్రాంతాల వారికీ కొన్ని వెబ్ సైట్ల ద్వారా ఇంటిని అద్దెకు ఇస్తారు. రోజులు, వారాలు, నెలల లెక్కన గెస్టులు అద్దెకు తీసుకోవచ్చు. ఇంటిలో సకల సౌకర్యాలు హోస్ట్ లు అంటే ఓనర్లే ఏర్పాటు చేస్తారు. అయితే ఈ విధానం ఇప్పుడు నగరంలోని ఓనర్లకు తలనొప్పిగా మారింది. షార్ట్ టర్మ్ రెంటల్ విధానంలో ఇంటిని అద్దెకు ఇస్తే  తనకు ఎదురైన  వింత అనుభవంతో  షాక్ కు గురైంది ఓ ఓనరమ్మా.. ఓ వీడియోను ఇంటర్నెట్ లో షేర్ చేయడం ద్వారా తన గోడును వెల్లబోసుకుంది.. అది కనీస మర్యాద, జవాబుదారీ తనం, ఇతరు పట్ల గౌరవంపై ఆన్ లైన్ లో తీవ్ర చర్చకు దారితీసింది. 

హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ప్రముఖ ఇండ్లు అద్దెకిచ్చే సంస్థ Airbnb ద్వారా తన ఇల్లును గెస్టులకు వారం రోజుల పాటు అద్దెకిచ్చింది. అయితే గెస్టుల చెక్ అవుట్ తర్వాత ఇంటి పరిస్థితిని చూసి షాక్ అయింది. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోను సిద్దార్థ్ అనే యూజర్ నెట్టింట షేర్ చేయడంతో బాగా వైరల్ అయింది. నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. 

ఆ వీడియోలో, గది పూర్తిగా చిందరవందరగా ఉండటం, ఎక్కడపడితే అక్కడు మూతపెట్టకుండా పడి ఉన్న ఆహారా పదార్థాలు, నేల ,గోడలపై మరకలు గది అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్న వ్యక్తిగత వస్తువులు కనిపించాయి.మంచాలు సర్దకుండా అస్తవ్యస్తంగా ఉన్నాయి. చెత్తను శుభ్రం చేసే ప్రయత్నం కూడా చేయకుండా వదిలేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

ఇంకా ఆ వీడియోలో ‘‘కొంతమంది గెస్టులు హోమ్-షేరింగ్ అనే భావనను తప్పుగా అర్థం చేసుకుంటున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది.  నేను Airbnb లా కాకుండా ఓ హోటల్‌ను నడుపుతున్నట్లు నాకు అనిపిస్తోంది అని’’ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన సిద్ధార్థ్..హోస్ట్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నీట్ నెస్ అనేది డబ్బులు ఇచ్చి చేయించుకునే  సేవ కాదు.. దాని పర్యవసానం మనిషే ఎదుర్కొవాల్సి ఉంటుందని రాశారు. సిద్దార్థ్ వ్యాఖ్యలతో నెటిజన్లు ఏకీభవించారు. గెస్ట్ బిహేవియర్ పై ఘాటుగా స్పందించారు. 

హోం షేరింగ్ వాతావరణంలో కనీస బాధ్యతగా నడుచుకోవాలి. ఇక్కడ గెస్టులలో  కనీస బాధ్యత లోపించినట్లు కనిపిస్తుంది. అదే విదేశాల్లో అయితే పరిస్థితి వేరేలా  ఉండేది.. ఇలా చేస్తే కఠినమైన రూల్స్, జరిమానాలు ఉంటాయని నెటిజన్లు  హోంషేరింగ్ లో అనుభవాలను ఎత్తి చూపారు. 

చర్చలో పదేపదే ప్రస్తావనకు వచ్చిన అంశం ఏంటంటే.. క్లీనింగ్ ఫీజులు కేవలం ఇంటిని మరో గెస్ట్ కోసం సిద్దం చేసేందుకు తీసుకునే ఖర్చు..  ఇంటిని నష్టం చేయడం, అధికంగా చెత్త వేయడం, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా ఉండటం కాదని నెటిజన్లు గెస్టులకు సలహాలు ఇచ్చారు.