V6 News

హైదరాబాద్లో ఫుట్ పాత్లపై షాపుల కూల్చివేత..

హైదరాబాద్లో ఫుట్ పాత్లపై షాపుల కూల్చివేత..

హైదరాబాద్ లో ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. రాజేంద్రనగర్ నుంచి శివరాంపల్లి, ఆరాంఘర్ వరకు రహదారుల పక్కన ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించారు అధికారులు. స్థానికుల ఫిర్యాదుతో శనివారం ( ఏప్రిల్ 18 ) రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో, ఇవాళ  భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేతలుచేపట్టారు అధికారులు.

ఫుట్ పాత్ లను ఆక్రమించడం వల్ల పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు అధికారులు. ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. ఇకపై జీహెచ్ఎంసీ నిబంధనలు ఉల్లంఘించి ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని... నిర్మాణాలు కూల్చేస్తామని హెచ్చరించారు జీహెచ్ఎంసీ అధికారులు.