హైడ్రాపై గత వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న..పేదల గుడిసెల జోలికి వెళ్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు: ఎమ్మెల్యే దానం

హైడ్రాపై గత వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న..పేదల గుడిసెల జోలికి వెళ్తే  ప్రభుత్వానికే చెడ్డ పేరు: ఎమ్మెల్యే దానం

సైఫాబాద్, వెలుగు: హైడ్రాపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పేద ప్రజల గుడిసెల జోలికి వెళ్తే.. ప్రభుత్వానికే చెడ్డ పేరని పేర్కొన్నారు. చెరువులు, నాళాలను కబ్జా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి సైతం సూచించారని గుర్తు చేశారు. 

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆనంద్‌‌‌‌నగర్ కమ్యూనిటీ హాల్‌‌‌‌లో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని 110 దేవాలయాలకు బోనాల నిర్వహణ కోసం చెక్కులు అందజేశారు. హైడ్రా చర్యల ద్వారా చెరువులు, నాళాలను కబ్జాల నుంచి రక్షించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. భారీ భవనాల నిర్మాణంలో కొందరు బిల్డర్లు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతులు పొందుతున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావినని పేర్కొన్నారు.