పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- పోస్ట్ పేరు: డిప్లొమా ట్రైనీ, జూనియర్ ట్రైనీ.
- మొత్తం ఖాళీలు: 660.
- పవర్ గ్రిడ్ రీజియన్ల వారీగా ఖాళీలు: కార్పొరేట్ సెంటర్ 21, ఈస్టర్న్ రీజియన్–I (ఈఆర్–I) 2, ఈస్టర్న్ రీజియన్–II(ఈఆర్–II) 16, ఒడిశా ప్రాజెక్ట్ 32, నార్త్ ఈస్టర్న్ రీజియన్ (ఎన్ఈఆర్) 33, నార్తర్న్ రీజియన్ (ఎన్ఆర్–I) 92, రాజస్థాన్ ప్రాజెక్ట్ 42, నార్తర్న్ రీజియన్ (ఎన్ఆర్–II) 50, నార్తర్న్ రీజియన్–III (ఎన్ఆర్–III) 45, సౌతర్న్ రీజియన్ –I(ఎస్ఆర్–I) 47, సౌతర్న్ రీజియన్–II (ఎస్ఆర్–II) 81, వెస్టర్న్ రీజియన్ –I (డబ్ల్యూఆర్–I) 67, వెస్టర్న్ రీజియన్–II (డబ్ల్యూఆర్–II)
- సీటీయూఐఎల్ ఖాళీలు: డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్) 16, డిప్లొమా ట్రైనీ (సివిల్) 6, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్ఆర్) 4, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (ఎఫ్&ఏ) 4.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత రంగంలో మూడేండ్ల డిప్లొమా, బీబీఏ/ బీబీఎం/ బీబీఎస్, సీఏ ఇంటర్/ సీఎంఏ, ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
- వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 20.
- అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ లకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్– సర్వీస్ మన్ అభ్యర్థుల ఫీజు మినహాయింపు ఉంటుంది.
- లాస్ట్ డేట్: మే 11.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.powergrid.inను సందర్శించండి.

