ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు డాక్టర్ల సూచన మేరకు ఈ సర్జరీ చేశారు. ఏప్రిల్ 17న ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆయనను ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటంతో వ్యక్తిగత డాక్టర్ల సలహా మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆయన ఆసుపత్రికి వెళ్లారు.
ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్‌కు పలు వైద్య పరీక్షలతో పాటు MRI స్కాన్ కూడా నిర్వహించారు. నివేదికలను పరిశీలించిన వైద్య బృందం తక్షణమే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించి సర్జరీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వారం నుంచి పది రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే శస్త్రచికిత్స అనంతరం ఆయన దీర్ఘకాలం పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు డాక్టర్లు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స
— JanaSena Party (@JanaSenaParty) April 18, 2026
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా…

