మొబైల్ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్... ఇలా చెక్ చేసుకోవాలి

మొబైల్ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్... ఇలా చెక్ చేసుకోవాలి

హైవేలపై టోల్ చెల్లింపు అనగానే.. ఒకప్పుడు బారెడు లైన్లతో కూడిన వాహనాలు గుర్తొచ్చేవి. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ రూపంలో వాహనాలు బారులు తీరే సమస్య తీరిపోయింది.  రోడ్డు రవాణా,  రహదారుల మంత్రిత్వ శాఖ 2016లో ఫాస్ట్‌ట్యాగ్‌ని ప్రవేశపెట్టింది, ఇది టోల్ ప్లాజాల వద్ద క్యూలను తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తోంది.  అదే సమయంలో హైవేలపై వేగంగా ప్రయాణించే వాహనాలను పర్యవేక్షిస్తుంది. 

వేగం పెరిగితే ఆటోమెటిక్ గా డబ్బులు కట్ చేస్తుంది. ట్యాక్స్, బ్యాలెన్స్ తదితర సమాచారాన్ని వెంటనే అందిస్తాయి. అదిఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్స్ వెహికల్- టు- రోడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు ఉపయోగించే ఈ ఫాస్ట్ ట్యాగ్ లలో యూపీఏ ద్వారా  బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా.  గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి ప్రసిద్ధ చెల్లింపు యాప్ లతో ఇది సాధ్యమే. ఈ యాప్ లు టోల్ ఎలానో చూసేయండి మరి.. 

గూగుల్ పే ఉపయోగించి చెక్ చేయండిలా..

  • మీ ఫోన్‌లో గూగుల్ పే యాప్‌ తెరవండి.
  • "రీఛార్జ్ & పే బిల్స్" ట్యాబ్‌పై నొక్కండి.
  • "ఫాస్టాగ్ రీఛార్జ్"  పై నొక్కండి.
  • ఆ సేవలు అందించే మీ బ్యాంక్‌ను ఎంచుకోండి.
  • మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.
  • మీ ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి "వ్యూ బ్యాలెన్స్" బటన్‌పై నొక్కండి.

పేటీఎంతో ఇలా.. 

  • మీ ఫోన్‌లో  పేటీఎం  యాప్‌ తెరవండి.
  • "పే బిల్స్" ట్యాబ్‌పై నొక్కండి.
  • "ఫాస్టాగ్" పై నొక్కండి.
  • వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ను వీక్షించడానికి  "వ్యూ బ్యాలెన్స్"  బటన్‌పై నొక్కండి.

ఫోన్ పే అయితే ఇలా చెక్ చేయండి.. 

  • మీ ఫోన్‌లో ఫోన్ పే యాప్‌ తెరవండి.
  • "రీఛార్జ్" ట్యాబ్‌పై నొక్కండి.
  • "ఫాస్ట్ ట్యాగ్"  పై నొక్కండి.
  • వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.
  • ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని చూడటానికి  "వ్యూ బ్యాలెన్స్" బటన్‌పై నొక్కండి.