టాప్ 1, 2 ర్యాంకులు భార్యాభర్తలవే

టాప్ 1, 2 ర్యాంకులు భార్యాభర్తలవే

పెళ్లాయ్యాక పిల్లలు, ఫ్యామిలీ అంటూ బిజీగా ఉండే ఈ రోజుల్లో ఓ జంట మాత్రం చదువుపై శ్రద్ధ పెట్టింది. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చదువుకున్నారు. పోటీ పరీక్షలకు రెడీ అయ్యారు. ఫలితంగా ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో టాప్ ప్లేస్ లో నిలిచారు. భర్త ఫస్ట్ ర్యాంకు సాధించగా.. భార్య రెండో ర్యాంకులో నిలిచారు. ఈ సంఘటన ఛత్తీస్ గడ్ లో జరగగా..రాష్ట్రవ్యాప్తంగా వారిపై ప్రశంసలు దక్కుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన అనుభవ్‌ సింగ్‌, విభా సింగ్ భార్యాభర్తలిద్దరూ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సెలక్ట్ కావడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. 11 సంవత్సరాలుగా కష్టపడి చదివారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా చదివారు. పోటీ పరీక్షలకు హాజరయ్యారు. ఈ సంవత్సరం చీఫ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌ బీ, గ్రేడ్‌ సీ)కు పరీక్ష రాశారు. ఇటీవల వచ్చిన ఫలితాల్లో వీరిద్దరూ ఫస్ట్, సెకండ్ ప్లేస్ లో నిలిచారు. అనుభవ్‌ కు 298.3744 మార్కులు రాగా.. విభా సింగ్‌ కు 283.9151 మార్కులు వచ్చాయి.

‘ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేం. చదువులో ఒకరికొకరం సాయం చేసుకున్నాం. విజయం సాధించాం. కుటుంబసభ్యులు కూడా మాకు ఎంతో అండగా నిలిచారు’ అని సంతోషం వ్యక్తం చేశారు. వీరిద్దరిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చదువుకు పెళ్లి, వయసు అవసరంలేదు. పల్లుదల, కృషి ఉంటే చాలు అని అనుభవ్, విభాసింగ్ నిరూపించారని కితాబిస్తున్నారు. విద్యార్ధులకు ఆదర్శింగా నిలిచారు హ్యాట్సాప్ అంటు కామెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.