ఇంటి తిండి కావాలి: కోర్టులో చిదంబరం పిటిషన్

ఇంటి తిండి కావాలి: కోర్టులో చిదంబరం పిటిషన్

న్యూఢిల్లీ:  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న చిదంబరం తనకు ఇంటి తిండి కావాలని పిటిషన్ వేశారు. జుడీషియల్ కస్టడీలో ఉన్నంత వరకు ఇంటిలో వండిన ఆహారం తెప్పించుకునే వీలు కల్పించాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై మూడో తేదీ వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తన కుమారుడు కార్తీకి ఐఎన్ఎక్స్ మీడియా పెట్టుబడులు పెట్టేలా కుమ్మక్కయి.. ఆ సంస్థకు అక్రమంగా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారాయన.

ఈ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే ఆయన బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ చిదంబరం పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.