కరోనా వ్యాక్సిన్ : మనుషులపై 3వ దశ ట్రయల్స్ ప్రారంభం..ఫలితాలు ఎప్పుడంటే

కరోనా వ్యాక్సిన్ : మనుషులపై 3వ దశ ట్రయల్స్ ప్రారంభం..ఫలితాలు ఎప్పుడంటే

కరోనా వైరస్ వ్యాక్సిన్ ను మనుషులుపై ప్రయోగం మూడో దశకు చేరుకుంది. నేటి నుంచి ప్రారంభమైన మూడో దశ ట్రయల్స్ ఫలితాలు జూన్ 28న విడుదలవుతున్నట్లు తెలుస్తోంది.

చైనాకు చెందిన చైనా నేషనల్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్ పై వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా   మొదటి దశ, రెండో దశ మనుషులపై ట్రయల్స్ ను స్వదేశంలోనే జరిపింది. కానీ మూడో దశ ట్రయల్స్ సమయానికి చైనాలో కరోనా కేసులు తగ్గిపోవడంతో ఇతర దేశాలకు చెందిన పలు కంపెనీలతో ఒప్పందాల్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా యూఏఈ కి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ జీ24 ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ను తయారు చేస్తుంది.

ఈ నేపథ్యంలో చైనా నేషనల్ బయోటెక్ సంస్థ , యూఏఈకి చెందిన జీ24లు మూడో దశ ట్రయల్స్ మనుషులుపై ప్రయోగం ఈరోజు నుంచే ప్రారంభించింది. ట్రయల్స్ ఫలితాలు ఈనెల 28న విడుదల కానున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ విడుదల కానుంది.