నిజామాబాద్ గన్నారంలో ఉద్రిక్తత..

నిజామాబాద్ గన్నారంలో ఉద్రిక్తత..

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ అర్వింద్ ను అడ్డుకున్నారు టీఆర్ఎస్ నేతలు. భారీగా టీఆర్ఎస్ నేతలు తరలివచ్చి.. అర్వింద్ కాన్వాయ్ ను అడ్డుకోవడంతో పోలీసులు TRS కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో స్వల్ప లాఠీచార్జ్ జరిగింది. అటు బీజేపీ నాయకులు కూడా భారీగా తరలివచ్చారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటా-పోటీ నినాదాలతో.. గన్నారంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనల మధ్యే ఇందల్వాయిలో ప్రకృతి వనం ప్రారంభించారు ఎంపీ అర్వింద్.

కేంద్రం నుంచి నిధులు రాకపోతే రాష్ట్రంలో కోడిగుడ్డు కూడా పెట్టదని కామెంట్ చేశారు ఎంపీ అర్వింద్. తనను అడ్డుకోవడం కేసీఆర్ వల్లకాదని చెప్పారు. గన్నారం గ్రామానికి ఎంపీల్యాడ్ నిధులు 10లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. తనను అడ్డుకునేలా ప్రోత్సహించినందుకు స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు థ్యాంక్స్ చెప్పారు అర్వింద్