టైటాన్ రిజల్ట్స్ ఓకే .. 2 వేల శాతం డివిడెండ్ ఇస్తున్న ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌

టైటాన్ రిజల్ట్స్ ఓకే .. 2 వేల శాతం డివిడెండ్ ఇస్తున్న ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌
  • ఓకే షేరుకి రూ. 11 డివిడెండ్‌‌‌‌‌‌‌‌
  • గోల్డ్‌‌‌‌‌‌‌‌ రేట్లు పెరిగినా రాణించిన జ్యువెలరీ బిజినెస్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: జ్యువెలరీ కంపెనీ  టైటాన్ ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 786 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది 7.1 శాతం ఎక్కువ.  పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ  గోల్డ్ ధరలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్‌‌‌‌‌‌‌‌పై ప్రభావం పడింది. ఫలితంగా కంపెనీ నికర లాభం ఈ ఏడాది జనవరి–మార్చి టైమ్‌‌‌‌‌‌‌‌లో అంచనాల కంటే తక్కువగా నమోదయ్యింది. కంపెనీకి రూ.811 కోట్ల నికర లాభం వస్తుందని మనీకంట్రోల్‌‌‌‌‌‌‌‌ పోల్‌‌‌‌‌‌‌‌లో ఎనలిస్టులు అంచనా వేశారు.  కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.8,553 కోట్ల రెవెన్యూ సాధించిన ఈ కంపెనీ, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.10,047 కోట్లు పొందింది. 

ఇది 17 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌కు సమానం. రెవెన్యూ 11.4 శాతం పెరిగి రూ.11,054 కోట్లకు చేరుకుంటుందని ఎనలిస్టులు అంచనావేశారు. కంపెనీ ఇబిటా (ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లు, వడ్డీల ముందు ప్రాఫిట్)  క్యూ4 లో రూ.1,109 కోట్లకు ఎగసింది.  షేరుకి రూ. 11 డివిడెండ్ ఇవ్వాలని టైటాన్ బోర్డు ప్రపోజ్ చేసింది. దీనిపై 40 వ యాన్యువల్ జనరల్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో షేర్ హోల్డర్ల అనుమతి తీసుకోనున్నారు.  కంపెనీ షేర్లు శుక్రవారం 0.96 శాతం పడి రూ.3,535 దగ్గర క్లోజయ్యాయి. 

జ్యువెలరీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌..

తనిష్క్‌‌‌‌‌‌‌‌, క్యారెట్‌‌‌‌‌‌‌‌లేన్‌‌‌‌‌‌‌‌  వంటి బ్రాండ్లను ఆపరేట్ చేస్తున్న టైటాన్‌‌‌‌‌‌‌‌ జ్యువెలరీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.8,998 కోట్ల రెవెన్యూ సాధించింది. ఏడాది ప్రాతిపదికన 19 శాతం వృద్ధి చెందింది.  మొత్తం 2023–24 ఆర్థిక సంవత్సరంలో టైటాన్ జ్యువెలరీ బిజినెస్ ఆదాయం రూ.38,353 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 20 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఇబిటా 12.3 శాతం పెరిగి రూ. 4,726 కోట్లకు చేరుకుంది.  ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  దుబాయ్‌‌‌‌‌‌‌‌, షికాగోలో తనిష్క్‌‌‌‌‌‌‌‌ స్టోర్లను ఓపెన్ చేసింది. విదేశాల్లో తనిష్క్ స్టోర్ల సంఖ్య 16 కు చేరుకుంది. క్యూ4 లో ఇండియాలో 11 కొత్త స్టోర్లను తెరిచింది. మియా 16 స్టోర్లను ఓపెన్ చేసింది. క్యారెట్‌‌‌‌‌‌‌‌లేన్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ నుంచి కంపెనీకి మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1,748 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ ఇండియాలో తన స్టోర్ల సంఖ్యను 110 కి పెంచుకుంది. 

వాచ్‌‌‌‌‌‌‌‌లు, వేరబుల్స్ బిజినెస్‌‌‌‌‌‌‌‌..

ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాచ్‌‌‌‌‌‌‌‌లు, వేరబుల్స్ బిజినెస్ నుంచి టైటాన్‌‌‌‌‌‌‌‌కు రూ.940 కోట్ల ఆదాయం వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 8 శాతం పెరిగింది. 2023–24 లో రూ.3,904 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  20 కొత్త ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ట్రాక్‌‌‌‌‌‌‌‌ స్టోర్లు, 10   టైటాన్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ స్టోర్లు, 14 హెలియోస్‌‌‌‌‌‌‌‌ స్టోర్లను టైటాన్ ఓపెన్ చేసింది. ఐ కేర్ సెగ్మెంట్ నుంచి కంపెనీకి మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1,166 కోట్ల ఆదాయం వచ్చింది. 2023–24  లో రూ.1,724 కోట్లు వచ్చాయి. మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టైటాన్ ఐ+ దుబాయ్‌‌‌‌‌‌‌‌లో కొత్తగా స్టోర్ ఓపెన్ చేసింది. 5 ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ట్రాక్‌‌‌‌‌‌‌‌ ఐవేర్ స్టోర్లను టైటాన్ ఐ+ గా మార్చింది.

ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ ప్రాఫిట్ రూ. 396 కోట్లు

టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌  షేరుకి రూ.194చొప్పున ఫైనల్ డివిడెండ్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. కంపెనీ ఇప్పటి వరకు ఇచ్చిన డివిడెండ్లలో ఇదే హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌.   ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే రూ. 3 ఇంటెరిమ్‌‌‌‌‌‌‌‌ డివిడెండ్‌‌‌‌‌‌‌‌ను 2023–24 ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రకటించింది. ఇది కూడా కలుపుకుంటే మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ షేరుకి రూ.200 డివిడెండ్ ఇచ్చినట్టు. 

ఇది షేరు ఫేస్ వాల్యూ రూ.10 తో పోలిస్తే 2 వేల శాతం ఎక్కువ. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో  రెండు ఇంటెరిమ్ డివిడెండ్లను కలుపుకొని రూ.175 లను  ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ ఇచ్చింది.  ఈ  ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ కంపెనీకి రూ. 396 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌) వచ్చింది. రెవెన్యూ  6,349 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేరు శుక్రవారం 4.55 శాతం తగ్గి రూ.1,27,767 దగ్గర ముగిసింది.