కాంగ్రెస్ ఉండకూడదని బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నయ్

కాంగ్రెస్ ఉండకూడదని బీజేపీ, బీఆర్ఎస్  కుట్రలు చేస్తున్నయ్

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణలో డైవర్షన్​ పాలిటిక్స్​ నడుస్తున్నాయని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని  బీజేపీ, బీఆర్ఎస్ లు​  కుట్రలు ఆడుతున్నాయన్నారు.  ప్రజలను మభ్య పెట్టడానికి ఈ రెండు పార్టీలు కావాలనే గందరగోళం క్రియేట్​ చేస్తున్నాయని అన్నారు.

తమది వ్యాపారస్తుల పార్టీ కాదని భట్టి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అతిపెద్ద వాటాదారుడుగా ఉన్నారని భట్టి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను దోచుకుంటుంటే ఈటల సపోర్ట్ చేస్తూ భాగస్వాములుగా ఉన్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.  

టీపీసీసీ చీఫ్ రేవంత్ పై  ఈటల బురద జల్లడాన్ని సీఎల్పీ నేత భట్టి ఖండించారు.  కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విలువలున్నాయన్నారు.  ఈటల నిన్నటి వరకు భూస్వాముల పార్టీలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విరాళాలను మాత్రమే ఎన్నికలకు వినియోగిస్తుందన్నారు. నీతి, నిజాయితీగా ఉండే  తమ పార్టీ  తప్పుడు పనులు చేయదన్నారు.