ట్రైన్‌లో కానిస్టేబుల్ ఫోన్ కొట్టేసి.. పోలీస్‌కే పాయిజన్ ఇచ్చి చంపారు

ట్రైన్‌లో కానిస్టేబుల్ ఫోన్ కొట్టేసి..  పోలీస్‌కే పాయిజన్ ఇచ్చి చంపారు

రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్‌ బాడీలోకి ఓ దొంగల ముఠా పాయిజన్ ఇంజక్ట్ చేసి పారిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. విశాల్ పవార్ థానేలో ఉంటూ  సియోన్ నుంచి మాతుంగా రైల్వే స్టేషన్ల మధ్య RPF కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్నాడు. ఏప్రిల్ 28న విశాల్ పవార్ సబర్బన్ ట్రైన్‌లో సివిల్ డ్రెస్ లో డ్యూటీ చేస్తున్నాడు. రాత్రి 9 గంటల టైంలో  రైళ్లో డోర్ దగ్గర నిల్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఓ దుండగుడు విశాల్ పవార్ ను ఢీకొట్టగా అతని ఫోన్ కిందపడింది. వెంటనే వ్యక్తి కిందపడ్డ ఫోన్ తీసుకొని నెమ్మదిగా వెళ్తున్న ట్రైన్ దిగి పారిపోతున్నాడు. 

విశాల్ కూడా ట్రైన్ దిగి ఆ దొంగని వెంబడించాడు. కొంతదూరం వెళ్లాక.. డ్రగ్స్ బాధితులుగా మారిన ఆ దొంగల గ్యాంగ్ ఎదురైంది. అందరూ కలిసి కానిస్టేబుల్ పై డాడి చేశారు. సినిమా ఫైట్ సీన్ మాదిరి అక్కడ ఫైటింగ్ జరిగింది. ఓ దొంగ విశాల్ వెనుకనుంచి వచ్చి వీపుపై పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చాడు. మిగతావారు విశాల్ ను గట్టిగా పట్టుకొని ఆ పోలీస్ నోట్లు రెడ్ కలర్ లిక్విడ్ పోశారు. దీంతో ఆయన స్పృహతప్పి పోయాడు. ఒకరోజు తర్వాత విశాల్ కు స్పృహ వచ్చింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు. కోప్రి పోలీస్ స్టేషన్ అధికారులు కానిస్టేబుల్ వాగ్మూలం తీసుకొని గుర్తుతెలియన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి విశాల్ ఆరోగ్యం క్షీణించింది. థానేలోని ఓ హాస్పిటల్ లో చేరాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ కానిస్టేబుల్ బుధవారం చనిపోయాడు.