మర్కుక్ పంపు హౌజ్ను పరిశీలించిన సీఎం భగవంత్ మాన్

మర్కుక్ పంపు హౌజ్ను పరిశీలించిన  సీఎం భగవంత్ మాన్

నీటి పారుదల రంగంలో తెలంగాణ మోడల్గా ఉందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల విధానాన్ని పంజాబ్లో కూడా అమలు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా మర్కుక్ పంపు హౌజ్ను సీఎం భగవంత్ మాన్ పరిశీలించారు. తెలంగాణలోని అన్ని వనరులు పంజాబ్లోనూ ఉన్నాయన్నారు. అక్కడ కూడా సాంకేతికను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో కాల్వల ద్వారా పంటలు పండించడంపై హర్షం వ్యక్తం చేశారు. పంజాబ్లో బావులు, బోర్లతోనే పంటలు ఎక్కువగా పండుతాయన్నారు. పంజాబ్లోనూ  కాల్వలను నిర్మించి వ్యవసాయానికి సాగునీరు అందిస్తామన్నారు. 

దేశ వ్యాప్తంగా రైతులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి అన్నదాతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు కూడా నిర్వహించారని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. అయినా 80 శాతం మంది వ్యవసాయమే చేస్తున్నారని...రైతుల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందన్నారు.