
సౌత్ బ్యూటీ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమస్య నుండి కోలుకున్న ఆమె ఈమధ్యే సినిమా సెట్స్ లో అడుగుపెట్టారు. ఇక సమంత ఓపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోపక్క సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు.
అయితే.. తాజాగా ఆలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు సమంత. ఈ పోస్టులో ఆమె.. మీరు వృషభరాశిని ఎప్పటికీ కోల్పోకండి.. అంటూ రాసుకొచ్చారు. కానీ, ఈ పోస్ట్ లో అర్థం ఏంటో తెలియక నెటిజన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజానికి సమంతది కూడా వృషభరాశి అన్న విషయం అందరికి తెలిసిందే. కొంతమంది ఈ మధ్య ఆమె మాజీ భర్త నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో కావాలనే సమంత ఇలాంటి పోస్ట్ పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, దానికి.. దీనికి సంబంధం ఏంటో అర్థం కావడంలేదు. మొత్తానికి అర్థం కాకుండా సమంత పెట్టిన పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారు. హాలీవుడ్ సూపర్ వెబ్ సిరీస్ సిటాడెల్ కుహిందీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇదే కాకుండా మరో సినిమాను కూడా ఇటీవలే మొదలుపెట్టారు సమంత. ఆమె స్వీయనిర్మాణ సంస్థలో వస్తున్న ఈ సినిమాకు మా ఇంటి బంగారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.