వేద పండితుల గౌరవ భృతి రూ.5 వేలకు పెంపు

వేద పండితుల గౌరవ భృతి రూ.5 వేలకు పెంపు

ఆలయాలకు దూపదీప నైవేద్యం కింద  అర్చకులకు భృతి రూ.10 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.  రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపనపల్లిలో  బ్రహ్మణ సదన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్..  బ్రహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు ఇస్తున్న భృతిని రూ. 2500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. భృతిని పొందే అర్హత వయస్సు  75 ఏళ్ల వయసు పరిమితి నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నామన్నారు.  ఆలయాలకు ఇకపై  అన్యువల్ గ్రాంట్ రూపంలో నిధులిస్తామని తెలిపారు. ఐఐటీ,ఐఏఎంలో చదివే బ్రాహ్మణ స్టూడెంట్లకు  ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపజేస్తామన్నారు.

Also Read: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం

 బ్రాహ్మణులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం కేసీఆర్ అన్నారు.  బ్రాహ్మణ సదనం నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. సూర్యపేటలోనూ త్వరలోనే  సదనం  భవనం ప్రారంభిస్తామని చెప్పారు.  దూపదీప నైవేద్య పథకం 6441 ఆలయాలకు పెంచుతున్నామని చెప్పారు. బ్రహ్మణ పరిషత్ కు ఏడాదికి 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.

   2017లో శేర్లింగంపల్లిలో  బ్రహ్మణ సదనం భవనానికి శంకుస్థాపన  చేశారు. 6 ఎకరాల 10 గుంటల స్థలం కేటాయించారు. 12 కోట్లు ఖర్చు చేసి భవనం నిర్మించారు.