ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ రహదారిపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ముందుగా వెళ్లున్న ఎమ్యెల్యే కాన్వాయ్ ని బీఆర్ఎస్  కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు కారు వేగంగా ఢీ కొట్టింది.

దీంతో కౌన్సిలర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే కారులోని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు.ఈ ఘటనలో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాగా, ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.