మంకీపాక్స్‌‌ అనుమానితుని నుంచి శాంపిల్స్ సేకరణ

మంకీపాక్స్‌‌ అనుమానితుని నుంచి శాంపిల్స్ సేకరణ

ఇయ్యాల సాయంత్రానికల్లా రిజల్ట్‌‌

హైదరాబాద్, వెలుగు: మంకీపాక్స్‌‌ అనుమానితుని నుంచి ఐదు రకాల శాంపిల్స్ సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్​కు ఫ్లైట్‌‌లో పంపించామని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌ డాక్టర్‌‌‌‌ శంకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికల్లా రిజల్స్ట్​ వచ్చే ఛాన్స్​ ఉందని చెప్పారు. ప్రస్తుతం పేషెంట్ కండీషన్ నిలకడగా ఉందని, ఇబ్బందేమీ లేదన్నారు. అతనికి మెడ, చేతులు, మొహం, ఛాతి, కాళ్లు, చేతులపై ఎర్రటి దద్దుర్లు ఉన్నాయన్నారు. ఇందులో చాలా వరకూ తగ్గిపోయే స్టేజ్‌‌లో ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. పేషెంట్‌‌కు ఇంకా ఎలాంటి ఇబ్బందుల్లేవన్నారు. దద్దుర్లతో మంట రాకుండా లోషన్ ఇచ్చామన్నారు. బాధితునికి ఉన్న లక్షణాలను బట్టి చూస్తే, అతనికి మంకీపాక్స్ వైరస్‌‌ సోకినట్టుగా తాము భావిస్తున్నామని పేషెంట్‌‌ను పరిశీలించిన ఓ డాక్టర్‌‌‌‌ ‘వెలుగు’కు తెలిపారు. అది కూడా తగ్గిపోయే స్థితిలో ఉండటంతో ప్రమాదం ఉండకపోవచ్చని వివరించారు.