15 ఏళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి.. హిస్టరీ క్రియేట్​ చేసిన అమ్మాయి

15 ఏళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి.. హిస్టరీ క్రియేట్​ చేసిన అమ్మాయి

మధ్యప్రదేశ్​కి చెందిన ఓ యువతి 15 ఏళ్లకే గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. ఇటీవల ప్రధాని మోదీ నుంచి అభినందనలు అందుకుంది. ఆ వివరాలు.. ఇండోర్​కి చెందిన తనిష్క సుజిత్​స్థానిక అహల్య యూనివర్సిటీ ఆఫ్ సోషల్​ సైన్సెస్​ నుంచి పిన్న వయస్సుల్లో పట్టా సంపాదించింది.బ్యాచిలర్​ ఆఫ్​ ఆర్ట్స్​లో సైకాలజీ కోర్సులో చేరిన ఆమె 74.20 శాతం మార్కులతో పాస్ అయింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ..  'నేను స్కూల్​ ఆఫ్​ సోషల్​సైన్స్​ దేవీ అహల్య యూనివర్సిటీ నుంచి బీఏ సైకాలజీలో ఉత్తీర్ణత సాధించాను. అంతర్జాతీయ చట్టాలు చదువుకోవాలనుకుంటున్నాను. అవి ఇండియాలో అందుబాటులో లేనందున జురిస్​ డాక్టర్​కోర్సు అభ్యసించడానికి అమెరికా లేదా యూకేకి వెళ్లాలనుకుంటున్నా. 

నేను 5వ తరగతి వరకు రెగ్యులర్​గానే చదివాను. 11 ఏళ్ల వయస్సులో నేరుగా హైస్కూల్​పరీక్ష రాశాను. అనంతరం 12వ తరగతికి వెళ్లాను. అందుకే నా డిగ్రీ త్వరగా పూర్తి అయింది. ఇలా చేయడానికి ప్రభుత్వం విద్యాశాఖ చట్టంలో కూడా మార్పులు తీసుకువచ్చింది. నాన్న కొవిడ్​మహమ్మారి సమయంలో మరణించాడు. అప్పటి నుంచి ఆర్థిక కష్టాలు చుట్టు ముట్టాయి. దీంతో పై చదువులకు వెళ్లడానికి సాయం కావాలని ఎంపీ శంకర్​లాల్వానీ ద్వారా ప్రభుత్వాన్ని కోరాం. అనంతరం ప్రధాని మోదీని కలవడం.. ఉన్నత చదువులకు భరోసా ఇవ్వడంతో విదేశాలకు వెళ్లాడానికి సిద్ధం అవుతున్నాను.' అని ఆమె వివరించారు.