మాణిక్కం ఠాగూర్ రాజీనామాపై కాంగ్రెస్ లో గందరగోళం

మాణిక్కం ఠాగూర్ రాజీనామాపై కాంగ్రెస్ లో గందరగోళం

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ లో గందరగోళం కొనసాగుతోంది. రాష్ట్ర ఇన్ చార్జ్  గా మాణిక్కం ఠాగూర్ రాజీనామా చేశారని కొందరు..అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. 

ఇటీవల  రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు మాణిక్కం ఠాగూర్ కు వ్యతిరేకంగా అధిష్టానం వద్ద తమ గళం వినిపించారు. పార్టీ పదవుల పంపకం విషయంలో రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని, ఆయనకు మాణిక్కం ఠాగూర్ వంత పాడారని.. రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు  కంప్లైంట్ చేశారు. అప్పటి నుంచే టీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మార్పు తథ్యమని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన రాష్ట్ర ఇన్ చార్జ్ గా తప్పుకున్నారని.. పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూప్ ల నుంచి లెఫ్ట్ అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది.