గ్రేటర్ లో మళ్లీ కంటెయిన్‌‌‌‌మెంట్లు!

గ్రేటర్ లో మళ్లీ కంటెయిన్‌‌‌‌మెంట్లు!

హైదరాబాద్​, వెలుగు :గ్రేటర్‌‌‌‌లో మళ్లీ కంటెయిన్‌‌‌‌మెంట్‌‌‌‌ జోన్లు ఏర్పాటు చేసేందుకు బల్దియా రెడీ అవుతోంది. మొదట్లో రోజుకు పదుల్లో నమోదైతే, ప్రస్తుతం1,500పైగా కేసులు వస్తున్నాయి. ఇక పాజిటివ్​ వచ్చిన వ్యక్తి ఇంటి పరిసరాలను మాత్రమే హోం క్వారంటెయిన్‌‌‌‌గా చేస్తున్నారు. దీంతో  కేసులు కంట్రోల్​ కావడం లేదు. పాజిటివ్​ వచ్చిన వ్యక్తి ఇంట్లోనే ఉంటుండడం, మిగతా ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ బయటకు వస్తుండగా వైరస్‌‌‌‌ స్ప్రెడ్​ఎక్కువవుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో కరోనా సోకిన వ్యక్తులు ఇష్టానుసారంగా బయట తిరిగి వెళ్తున్నారు. వారికి పాజిటివ్​ వచ్చిన విషయం ఇతరులకు కూడా తెలియడం లేదు. దీంతో పేషెంట్​తో క్లోజ్‌‌‌‌గా ఉంటుండగా, మిగతా వారికి వైరస్‌‌‌‌ అంటుకుంటోంది. ప్రస్తుతం సిటీలో ఇలాంటి పరిస్థితే ఎక్కువగా ఉంది. వారం కిందట కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్​సెక్రటరీ లవ్​ అగర్వాల్​టీమ్‌‌‌‌   సిటీలో  పర్యటించింది. వైరస్‌‌‌‌ కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది.   కాంట్రాక్టు ట్రేసింగ్,​ కంటెయిన్‌‌‌‌ మెంట్లను పకడ్బందీగా కొనసాగించాలని, వచ్చే రెండు నెలలకు యాక్షన్​ ప్లాన్ ​సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో మళ్లీ కంటెయిన్‌‌‌‌మెంట్‌‌‌‌ జోన్లు ఏర్పాటు చేసేందుకు బల్దియా సిద్ధమవుతోంది.  జోనల్​ కమిషనర్లు రెడీగా ఉండాలని కమిషనర్ ఆదేశించినట్లు తెలిసింది.

ఐదుకుపైగా  కేసులున్న ఏరియాల్లో..

ఐదు కేసుల కంటే ఎక్కువ ఉండే ఏరియాను కంటెయిన్‌‌‌‌మెంట్‌‌‌‌ గా ఏర్పాటు చేసి జీహెచ్‌‌‌‌ఎంసీ చర్యలు చేపట్టనుంది. లాక్‌‌‌‌డౌన్  పీరియడ్‌‌‌‌లో జోన్ల ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవడంతోనే  పాజిటివ్‌‌‌‌లు  తక్కువగా నమోదయ్యాయి. అప్పట్లో ఒక వ్యక్తికి కరోనా సోకితే, ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌కు వెంటనే టెస్టులు చేసి  హోం క్వారంటైన్​ చేయడంతో పాటు ఆ ఏరియాను కంటెయిన్‌‌‌‌మెంట్‌‌‌‌ జోన్​గా చేశారు. అందులోని వారు ఎవరూ బయటకు రాకుండా, బయటి నుంచి లోపలికి పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో వైరస్‌‌‌‌ స్ప్రెడ్‌‌‌‌ కాలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అన్ని ఏరియాల్లో  కరోనా విజృంభిస్తోంది.

ముంబై తరహాలో ఏర్పాటు

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లో ఏప్రిల్​ఫస్ట్‌‌‌‌ వీక్‌‌‌‌ నుంచి పాజిటివ్‌‌‌‌లు పెరుగుతుంటే కంటెయిన్‌‌‌‌మెంట్‌‌‌‌ జోన్లు ఏర్పాటు చేశారు. అదే నెల 8న 160 కేసులుంటే 12 ఏరియాలను జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. జూన్ లో 200 ఏరియాల్లో పెట్టారు. ఆ తర్వాత కేంద్రం అన్‌‌‌‌లాక్​1.0 ప్రకటించడం, పాజిటివ్​ వ్యక్తులు హోం క్వారంటెయిన్‌‌‌‌లో ఉండాలని ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​ఇవ్వడంతో  జోన్ల ఏర్పాటు పట్టించుకోలేదు. జూన్ నెల నుంచి కేసులు పెరుగుతూ  జూలైలో  ఇప్పటివరకు18వేలు దాటాయి. ఐదు కేసుల కంటే ఎక్కువగా ఉన్న ఏరియాల్లో జోన్లు ఏర్పాటు చేయాలంటే ముంబై తరహాలో దాదాపు 800 ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తద్వారా వైరస్​ కంట్రోల్​అయ్యే అవకాశముంటుందని మెడికల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ పేర్కొంటున్నారు.

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పై క్లారిటీ లేదు

గ్రేటర్​లో  వైరస్ వ్యాప్తి తీవ్రమవుతుం డడంతో  మళ్లీ లాక్‌‌‌‌డౌన్​ పెడితేనే కంట్రోల్​అవుతుందని ప్రభుత్వానికి వైద్యశాఖ అధికారులు నివేదించారు. అయినప్పటికీ సర్కార్‌‌‌‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌‌‌‌ లేదు. దీనిపై బల్దియా కూడా స్పష్టత ఇవ్వడం లేదు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌పై ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలని అధికారు లు చెప్తున్నారు. అయితే మళ్లీ కంటెయిన్‌‌‌‌మెంట్లు పెడుతున్నారంటే లాన్‌‌‌‌ డౌన్​ఉండకపోవచ్చని చర్చించుకుంటున్నారు.