వచ్చేఏడాది మార్చినాటికి విడుదల కానున్న కరోనా వ్యాక్సిన్

వచ్చేఏడాది మార్చినాటికి విడుదల కానున్న కరోనా వ్యాక్సిన్

కరోనా వల్ల ప్రపంచదేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో వైరస్ కు విరుగుడుగా ప్రపంచ దేశాలకు చెందిన సైంటిస్ట్ లు  వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పై చేస్తున్న పరిశోధనలు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెల నాటికి వ్యాక్సిన్ ను భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండియాటుడే తెలిపింది. కాగా కోవ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ మూడోదశలో ఉన్నాయి. త్వరితగతిన ట్రయల్స్ పూర్తి చేసి 2021, మార్చి నెలలో వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.