123 మందిపై విచారణకు అనుమతించండి: సీవీసీ

123 మందిపై విచారణకు అనుమతించండి: సీవీసీ

న్యూఢిల్లీ: అవినీతి అధికారులపై విచారణ కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఐఏఎస్ లు, 45 మంది బ్యాంకు అధికారులతోపాటు మొత్తం 123 మంది అవినీతి అధికారుల విచారణకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. వీరిలో సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాల అధికారులూ ఉన్నారు.  అవినీతి అధికారులపై విచారణకు 4 నెలల్లోపు అనుమతి ఇవ్వాలి. వివిధ శాఖలకు చెందిన  అధికారులపై 57 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు సీవీసీ చెబుతోంది. అవినీతి వ్యవహారాల్లో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ లోనే 8 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది. రైల్వే శాఖ, యూపీ గవర్నమెంట్ లో 5 చొప్పున కేసులు పెండింగ్ లో ఉన్నట్లు చెప్పింది. సీబీఐ అడిషనల్ ఎస్పీ, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్,  ఐటీ అధికారిపై విచారణకు అనుమతి కోరింది.  ఎస్ బీఐ, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పీఎన్​బీ, అలహాబాద్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఓబీసీకి చెందిన 45 మంది ఉద్యోగులపై 15 కేసులు పెండింగ్ లో  ఉన్నట్లు సీవీసీ డేటా చెబుతోంది. ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు చెందిన 16 మంది, కార్పొరేషన్ బ్యాంక్, ఎస్ బీఐ, పీఎన్​బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంకుల అధికారులపై ఏడు చొప్పున కేసులున్నాయి. వీరిపై విచారణకు అనుమతిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’అని సీవీసీ చెప్పారు. యూనియన్ టెర్రిటరీస్, రెవెన్యూ, డిఫెన్స్, ఫుడ్ అండ్ సేఫ్టీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల్లనూ రెండు చొప్పున  కేసులు పెండింగ్ లో  ఉన్నట్లు తెలిపింది.