వైరల్: మహేశ్​ డైలాగ్ తో అదరగొడుతున్న వార్నర్

వైరల్: మహేశ్​ డైలాగ్ తో అదరగొడుతున్న వార్నర్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలపై ఎనలేని ప్రేమను చూయిస్తున్నాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ పాటకు టిక్ టాక్ వీడియోలో అదిరే స్టెప్పులతో అలరించిన వార్నర్ ఇప్పుడు మహేశ్ బాబు సినిమా డైలాగ్ తో ఆకట్టుకుంటున్నాడు.

యూత్, మాస్ లో మహేశ్ కు అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన ఫిల్మ్ పోకిరి. ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ డైలాగ్ తో వార్నర్ టిక్ టాక్ వీడియో చేశాడు. ఏ సినిమానో గెస్ చేయండి, గుడ్ లక్ అని రాసి ఇన్ స్టాగ్రామ్ లో వార్నర్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.