డిగ్రీ ఫీజుల మోత

డిగ్రీ ఫీజుల మోత

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఫీజుల మోత మోగనుంది. దాదాపు అన్ని కోర్సుల్లో రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ట్యూషన్ ఫీజులు పెరగనున్నాయి. ఈ అదనపు మొత్తం ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ కింద రాదని, విద్యార్థుల నుంచే వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల పెంపు అమల్లో కి వచ్చే అవకాశముంది. దీంతో సుమారు రెండున్నర లక్షల మంది డిగ్రీ విద్యార్థులపై భారం పడనుంది. పట్టణాల్లో ఏదో ఓ పని చేసుకుంటూ డిగ్రీ చదువు కుంటున్నవారికి మరింత ఇబ్బందికరంగా మారనుంది.

పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలో మొత్తం1,151 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 923 ప్రైవేటు, 238 సర్కారు కాలేజీలు. వీటన్నింటి లో కలిపి 4,43,269 సీట్లుం డగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2,33,947 సీట్లు మాత్రమే నిండాయి. ప్రస్తుతం వర్సిటీల్లో ఒక్కో కోర్సుకు ఒక్కో రకమైన ఫీజు ఉంది. బీఏ కోర్సుకు రూ. 6,170 నుంచి రూ.6,390 వరకు, బీకాం (కంప్యూ టర్‌‌‌‌)కు రూ.8,950 నుంచి రూ.12,470 వరకు, బీకాం (జనరల్‌‌‌‌)కు రూ.8,550 నుంచి రూ.12,370 వరకు, బీఎస్సీ కోర్సుకు రూ.10,750 నుంచి రూ.13,520 వరకు ఫీజులు ఉన్నాయి. అన్ని యూనివర్సిటీల పరిధిలో కోర్సుల వారీగా కామన్‌‌‌‌ ఫీజులు పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది.