IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను (DC) 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఆర్‌సీబీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభం నుంచే వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. యువ ప్లేయర్ అభిషేక్ పోరెల్ (30 పరుగులు) ఒక్కడే పోరాటం చేసినా, మిగిలిన వారు చేతులెత్తేయడంతో ఢిల్లీ 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్‌సీబీ ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది.
అయితే టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ తీసుకోవడంతో.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అరంగేట్రం చేసిన యంగ్ ప్లేయర్ సాహిల్ పరాఖ్ మ్యాచ్ రెండో బంతికే అవుట్ కాగా, ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీలని జోష్ హేజిల్‌వుడ్ వేసిన వరుస బంతుల్లో అవుట్ కావడంతో స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయింది. క్రమశిక్షణతో కూడిన బెంగళూరు బౌలింగ్ ముందు ఢిల్లీ ఆటగాళ్లు కనీసం పోరాట పటిమ కూడా ప్రదర్శించలేదు.
కుప్ప కూలిన బ్యాటింగ్:
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కష్టాలు అక్కడితో తీరలేదు. స్టార్ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా త్వరలోనే పెవిలియన్ చేరారు. కేవలం 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో నితీష్ రాణా బ్యాటింగ్ కి వచ్చినప్పటికీ, అతను కూడా 8 పరుగుల దగ్గర ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక బెంగళూరు బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ తమ స్వింగ్, బౌన్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. మొదటి 6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి కేవలం 13 రన్స్ మాత్రమే చేసింది. ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఒక జట్టు పవర్ ప్లేలో సాధించిన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం.
ఐపీఎల్లో అత్యల్ప పవర్ ప్లే స్కోర్లు:
* 13/6 – ఢిల్లీ క్యాపిటల్స్ vs బెంగళూరు, ఢిల్లీ, 2026*
* 14/3 – హైదరాబాద్ vs రాజస్థాన్, పూణే, 2022
* 14/2 – రాజస్థాన్ vs బెంగళూరు, కేప్ టౌన్, 2009
* 15/2 – చెన్నై vs కోల్‌కతా, కోల్‌కతా, 2011
* 16/1 – చెన్నై vs ఢిల్లీ, రాయ్‌పూర్, 2015

