మెహబూబా ముఫ్తీ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

మెహబూబా ముఫ్తీ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) ఇచ్చిన సమన్లను నిలుపుదల చేయాలని ఆమె వేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఆ ఆదేశాలను నిలుపుదల చేయలేమని చెప్పింది.

ముఫ్తీ దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ(శుక్రవారం) విచారించిన చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. ఈడీ, కేంద్ర ప్రభుత్వాలకూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.

మార్చి 22న మనీ లాండరింగ్ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా మెహబూబాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే, వాటిని సవాల్ చేస్తూ మెహబూబా డిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అసలు తనను నిందితురాలిగా విచారణకు రమ్ముంటున్నారా..లేక.. సాక్షిగా రమ్మంటున్నారా.. అన్న విషయాలను తెలిపకుండానే నోటీసులిచ్చారని అందులో తెలపారు.

ఏ కేసుకు సంబంధించి సమన్లు ఇచ్చారో ఆ కేసుకు సంబంధించిన పేపర్లను ఇప్పించాలని కోర్టును కోరారు. ఆమెతో పాటు ప్రభుత్వ తరఫు లాయర్ వాదనలు విన్న డివిజన్ బెంచ్.. నోటీసులను నిలుపుదల చేయలేమని చెప్పిందిమెహబూబా ముఫ్తీ.