పాకిస్థాన్‌లో డెంగీకి 250మంది బలి

పాకిస్థాన్‌లో డెంగీకి 250మంది బలి

పాకిస్థాన్ లో డెంగీ జ్వరానికి వందలమంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది ఇంకా హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వం , అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. పెద్దసంఖ్యలో ప్రాణనష్టం జరిగింది.

పాకిస్థాన్ లోని ప్రధాన నగరాల్లోని హాస్పిటళ్లన్నీ ఇపుడు డెంగీ ఫీవర్ బాధితులతో నిండిపోయాయి. అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 12 వరకు 250మంది వరకు డెంగీ జ్వరం వల్ల చనిపోయారు. రావల్పిండి, ఇస్లామాబాద్ లలోనే ఇందులో సగం మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువగా డెంగీ జ్వర పీడితులు ఈ రెండు నగరాల్లోని హాస్పిటళ్లలోనే చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం తమ దేశంలో 65 వేలమంది జ్వరంతో బాధపడుతున్నారని పాకిస్థాన్ అధికారులు చెప్పారు.