డిజిటల్ క్లాసుల నిర్వహణ..స్కూల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ దేవసేన ఆదేశాలు

డిజిటల్ క్లాసుల నిర్వహణ..స్కూల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ దేవసేన ఆదేశాలు

డిజిటల్ క్లాసుల నిర్వహణ పై డీఈఓ లకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ దేవసేన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో టీ సాట్ ,దూరదర్శన్ అన్ని ప్రాంతాల్లో ప్రసారం అయ్యేలా డీఈవో లు చొరవ తీసుకోవాల‌ని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో కేబుల్ అపరేటర్లు టీ సాట్, దూరదర్శన్ ప్రసారం చేయడం లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఏ జిల్లా ప్రాంతాల్లో అయితే టీ సాట్, దూరదర్శన్ ప్రసారం కావడం లేదో వెంటనే ఆ జిల్లా కలెక్టర్లను డీఈఓ లు క‌లిసి కేబుల్ అపరేటర్ల కు టీ సాట్, దూరదర్శన్ ప్రసారం చేసేలా అదేశాలు జారీ చేయించాలన్నారు. ప్రతి విద్యార్థి ఇంట్లో డిజిటల్ క్లాసులు ప్రసారం అయ్యేలా డీఈఓ లు కృషి చేయాల‌న్న డైర‌క్ట‌ర్ దేవ‌సేన ..టీ సాట్,దూరదర్శన్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వచ్చేల డీఈఓ లు,కేబుల్ ఆపరేటర్ల తో సమావేశం కావాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ దేవసేన ఆదేశాలు జారీ చేశారు.