వీర‌వెల్లి పెద్దచెరువులో చేపపిల్లల పంపిణీ

వీర‌వెల్లి పెద్దచెరువులో చేపపిల్లల పంపిణీ

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా, వీర‌వెల్లి వెలుగు: చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు భువ‌న‌గిరి మండ‌ల రైతుబంధు స‌మితి క‌న్వీన‌ర్ కంచి మ‌ల్ల‌య్య‌. మత్స్యఅభివృద్ధి పథకం ద్వారా ఆ శాఖ జిల్లా వాప్తంగా చేపపిల్లల పంపిణీ కర్యాక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా సోమ‌వారం జిల్లా మ‌త్య్స‌శాఖ అధికారులు భువ‌న‌గిరి మండ‌లంలోని వీర‌వెల్లిలో గ‌ల‌ పెద్దచెరువులో గ్రామ ప్ర‌జా ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో లక్షా ఐదు వేల‌ చేపపిల్లలను వదిలారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై మాట్లాడిన కంచి మ‌ల్ల‌య్య .. వర్షాలు కురుస్తుండడంతో మండ‌లంలోని చెరువులు, కుంటల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయని, చెరువులపై ఆధారపడి జీవించే వారి అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. వర్షాలు మొదలై చెరువుల్లోకి నీరు చేరినందున.. ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ చేపడుతుందని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ స‌ర్పంచ్ క‌ల్ప‌న శ్రీనివాసచారి‌, ఎంపీటీసీ ల‌లిత మ‌ల్ల‌య్య‌‌, మత్స్యశాఖ జిల్లా అధికారిణి షకీలాభాను, గ్రామ‌ మ‌త్య్స సొసైటీ అధ్య‌క్షుడు బీమ‌రి మ‌ల్లేష్, మ‌త్య్స‌‌కారులు సోకం సాయిలు, సోకం వెంక‌ట‌య్య‌, బీమ‌రి మ‌చ్చెంద‌ర్, త‌మ్మ‌ల నీల‌య్య‌, మార‌బోయిన స‌త్త‌య్య‌, త‌మ్మ‌ల నాగ‌రాజు తదిత‌రులు పాల్గొన్నారు.

సంతోషంగా చేప‌పిల్ల‌ల‌ను వ‌దులుతున్న మ‌త్య్స‌కారులు