ఢిల్లీ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ

ఢిల్లీ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ

12 గంటలు శ్రమించి భార్య లివర్​ను భర్తకు అమర్చిన 21 మంది వైద్యులు

ప్లాస్మా-ఫెరిసిస్ ప్రక్రియ ద్వారా రోగి పునర్జన్మ

న్యూఢిల్లీ : భర్త కష్ట నష్టాలను భార్య పంచుకుంటుంది. అతడికి తోడు, నీడగా నిలబడుతుంది. అందుకే ఆమెను అర్ధాంగి అంటారు. ఈ పదానికి సరికొత్త అర్ధం తెలిపిందో మహిళ. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను బతికించుకోవాలని ఆరాటపడింది. తన శరీరంలోని లివర్​ను భర్తకు ఇచ్చేందుకు సిద్ధపడింది. కానీ ఆమె బ్లడ్ గ్రూప్ భర్త బ్లడ్ గ్రూప్​తో మ్యాచ్ కాలేదు. భార్య లివర్​నే భర్తకు సరిపోయేలా వినూత్న పద్ధతిలో డాక్టర్లు సర్జరీ సక్సెస్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బీహార్​కు చెందిన శివ(29), పార్వతి(21)  దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. తల్లితో సహా ఆరుగురు కుటుంబానికి శివ ఏకైక జీవనాధారం. జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో శివ హెల్త్ ఒక్కసారిగా దెబ్బతింది. అతనికి లివర్ సిర్రోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిందని బీహార్ లోని డాక్టర్లు చెప్పారు.

లివర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్ సర్జన్ చేయాలని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడని వెల్లడించారు. భర్తను ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో తన లివర్​ను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని డాక్టర్లకు తెలిపింది. లివర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్ సర్జన్ కోసం సెంట్రల్ ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్​కు వెళ్లాలని పార్వతికి డాక్టర్లు సూచించారు. అన్ని చెకప్​లు చేసిన డాక్టర్లు పార్వతి, శివల బ్లెడ్ గ్రూప్ ఒక్కటి కాదని తెలిపారు. బ్లెడ్ గ్రూప్ సేమ్ కానందునా శివకు పార్వతి లివర్ సరిపోదన్నారు. మరోమార్గంలేక ప్లాస్మా-ఫెరిసిస్ ప్రక్రియ ద్వారా శివకు లివర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్ చేయాలని డాక్టర్లు డిసైడ్ అయ్యారు. దాదాపు 12 గంటలు కష్టపడిన 21 మంది డాక్టర్లు.. ప్లాస్మా-ఫెరిసిస్ ప్రక్రియతో లివర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు.