చిన్నారికి 16 కోట్ల ఇంజెక్షన్ వేశారు

చిన్నారికి 16 కోట్ల ఇంజెక్షన్ వేశారు

అరుదైన వెన్నెముక కండరాల వ్యాధితో బాధ పడ్తున్న 6 నెలల చిన్నారి తీరా కామత్ కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్ జెన్ స్మా ఇంజెక్షన్ ఇచ్చారు. చిన్నారిని అబ్జర్వేషన్ లో ఉంచామన్నారు ముంబై హిందుజా హాస్పిటల్ డాక్టర్లు. తీరా కామత్ కు ఇచ్చిన ఇంజక్షన్ ధర 16 కోట్లు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బు సేకరించారు. ఇంజక్షన్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తీరా కామత్ తల్లిదండ్రుల విజ్ఞప్తితో ఇంజక్షన్ పై జీఎస్టీ, ఇంపోర్ట్ డ్యూటీ ఆరున్నర కోట్ల రూపాయలను మాఫీ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

జన్యుపరమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి వ్యాధితో బాధ పడ్తోంది 6 నెలల తీరా కామత్. పాపను బతికించుకోవాలంటే జీనీ థెరపీ చేయాలి. కానీ మన దేశంలో ఈ చికిత్స లేదు. అమెరికా నుంచి 16 కోట్ల విలువైన జోల్ జెన్ స్మా ఇంజక్షన్ తెప్పిస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అయితే ఇంజక్షన్ ఖర్చు భరించే స్థోమత… తీరా కామత్ తల్లిదండ్రులకు లేదు. దీంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించారు. తీరా కామత్  ముంబైలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.