ఎంతకు తెగించార్రా?: అటాక్‌ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్

ఎంతకు తెగించార్రా?: అటాక్‌ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్

కాస్త డబ్బులుంటే శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఓ షాప్ ఓనర్ పైకి నలుగురు దుండగులు కత్తులు, గన్స్ పట్టుకొని దాడి చేశారు. ఓనర్ భయపడకుండా ఎక్కడే నలుగురిని బెదరగొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో మే4న చోటుచేసుకుంది. నలుగులు వ్యక్తులు కంట్రీ మేడ్ పిస్టల్స్ తీసుకొచ్చి మీరట్‌లోని ఇంచౌలీలో అల్యూమినియం వర్క్ షాప్ ఓనర్ పై కాల్పులు జరిపారు.

ఓనర్ జమీల్ చాకచక్యంగా ప్రవర్తించి సోఫా, ఛైర్స్, ఫర్నిఛర్ సాయంతో వాళ్ల దాడి నుంచి తప్పించుకొని నలుగురిని తరిమాడు. ఇదంతా షాప్ లోని సీసీకెమెరాలో రికార్డ్ అయింది. నిధింతులపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇంచౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి, నలుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.