షారుఖ్–రాజ్ కుమార్ హిరానీల క్రేజీ కాంబో

షారుఖ్–రాజ్ కుమార్ హిరానీల క్రేజీ కాంబో

రాజ్ కుమార్ హిరానీ – షారుఖ్ ఖాన్.... ఇద్దరూ ఇద్దరే. విలక్షణమైన కథాంశాలతో హార్ట్ టచింగ్ సినిమాలు తీసే స్టార్ డైరెక్టర్ ఒకరైతే... కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్... ఇలా ఏ ఎమోషన్నైనా అలవోకగా పండించే యాక్టింగ్ కింగ్ మరొకరు. ఇక ఈ ఇద్దరు జీనియస్ లు కలిసి సినిమా చేస్తే... బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తామిద్దరి కాంబినేషన్ లో త్వరలోనే సినిమా రాబోతున్నట్లు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ప్రకటించాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో మొదటిసారి ‘డంకీ’ అనే సినిమా చేయబోతున్నట్టు తెలిపాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో షారుఖ్ ఓ వీడియో పోస్ట్ చేశాడు.

‘డియర్ రాజ్ కుమార్ హిరానీ సార్.. మీతో పని చేయడం చాలా గర్వంగా ఉంది. మీతో పని చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. మీరు సినిమా ప్రారంభించండి. నేను టైమ్ కు షూటింగ్ స్పాట్ కు వస్తా. రావడం కాదు ఎప్పుడూ సెట్ లోనే ఉంటా. వచ్చే ఏడాది డిసెంబర్ 22న ‘డంకీ’ మూవీతో మీ అందరి ముందుకు వస్తున్నా’ అంటూ షారుఖ్ కామెంట్ చేశాడు.

ఇక వీడియోలో షారుఖ్- రాజ్ కుమార్ హిరానీలిద్దరూ మాట్లాడుకుంటుంటారు. వారికి ఎదురుగా ఉన్న స్క్రీన్ పై పీకే, సంజూ, మున్నాబాయి ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ సినిమాలకు సంబంధించిన పోస్టర్లు ఉంటాయి. వాటివైపు చూపిస్తూ.. తన కోసం ఆ సినిమాల్లాంటి ఏదైనా స్క్రిప్ట్ ఉందా? అని షారుఖ్ హిరానీని అడుగుతాడు. దానికి హిరానీ సమాధానమిస్తూ... తమ కలయికలో వచ్చే సినిమా పేరు ‘డంకీ’ అని, అందులో కామెడీ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్తాడు. కాగా.. ఈ సినిమాలో షారుఖ్ కు జోడీగా తాప్సీ నటిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

 

మరిన్ని వార్తల కోసం...

జనసేనది విలువలతో కూడిన రాజకీయం

ఇష్టం లేని పెళ్లి.. వరుడి చెంప పగలగొట్టిన వధువు..