
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేనది విలువలతో కూడిన రాజకీయమని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు మనోహర్ తెలిపారు. ఆర్థిక సాయం చెక్కులు పవన్ అందిస్తారని చెప్పారు నాదెండ్ల మనోహర్.