లాక్ డౌన్ తో ఉపాధి లేక… మెదడుకు పనిపెట్టి… ఎకో ఫ్రెండ్లీ సైకిల్ తయారు చేసిన కార్పెంటర్

లాక్ డౌన్ తో ఉపాధి లేక… మెదడుకు పనిపెట్టి… ఎకో ఫ్రెండ్లీ సైకిల్ తయారు చేసిన కార్పెంటర్

లాక్​డౌన్​ వల్ల ఈ కార్పెంటర్​  షాప్​ మూతపడింది. ఎప్పుడూ చేతినిండా పనితో క్షణం తీరిక లేకుండా ఉండే ఇతనికి  ఏం చేయాలో తెలియనంత ఖాళీ టైం దొరికింది. మొదటి రెండుమూడు రోజులు ఫ్యామిలీతో  సరదాగా గడిపాడు. కానీ, తర్వాత మెల్లిగా బోర్​ మొదలైంది. దాంతో డిఫరెంట్​గా ఏదైనా ప్రయోగం చేయాలనుకున్నాడు.  కట్​ చేస్తే.. నాలుగు నెలల్లో చెక్కతో సైకిల్​ని తయారుచేశాడు.  ఇప్పుడీ సైకిల్​కి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్​ వచ్చింది. ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఆ కార్పెంటర్​ ఎవరో ఎక్కడుంటాడో  తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఎకో ఫ్రెండ్లీ సైకిల్​తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ కార్పెంటర్​ పేరు ధని రామ్​ సగ్గు. పంజాబ్​లోని జిర్ఖాపూర్​   ఈ కార్పెంటర్​ సొంతూరు.  మార్చి  24 లాక్ అనౌన్స్​ చేయడంతో  షాప్​ కట్టేసి అప్పట్నుంచి ఇంటికే పరిమితమయ్యాడు ధనిరామ్​. ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఇంట్లోని పాత చెక్కలు, రంపం మిషీన్​, రెంచీలు,  అన్నింటిని ఒకచోట చేర్చి  సైకిల్ తయారీ మొదలుపెట్టాడు.  మొదటి రెండుమూడు ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యాడు. అయినా సరే వెనకడుగేయకుండా  మళ్లీ ప్రయత్నించి చెక్కతో ఎకో ఫ్రెండ్లీ సైకిల్​ తయారుచేశాడు. మరుసటి రోజే 15000 చేతికిచ్చి ఆ సైకిల్​ని కొనుక్కెళ్లాడు  ఓ కస్టమర్​. మరిన్ని ఆర్డర్స్​ కూడా వచ్చాయి. ఏదో టైంపాస్​ కోసం చేసిన ప్రయత్నం అందరికీ నచ్చడంతో మరిన్ని సైకిల్స్​ తయారుచేశాడు ధనిరామ్​. ప్రస్తుతం కెనడా లాంటి  దేశాలకి కూడా తన ఎకో ఫ్రెండ్లీ సైకిల్స్​ని ఎగుమతి చేస్తున్నాడు ఈ కార్పెంటర్.