ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
  • భగ్గుమన్న ఉత్తర తెలంగాణ.. కాస్త చల్లబడ్డ దక్షిణ జిల్లాలు
  • జగిత్యాల జిల్లా అల్లీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 46.8 డిగ్రీలు
  • పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో 46కు పైగానే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. దాదాపు అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జారీ చేసింది. ఆ తర్వాత మూడు రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, సోమవారం 16 జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా ఉన్నట్టు వెల్లడించింది.

కాస్త చల్లబడ్డ దక్షిణ తెలంగాణ..రాష్ట్రంలో సోమవారం టెంపరేచర్లు కొద్దిగా తగ్గాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగగా.. దక్షిణ తెలంగాణ మాత్రం కాస్తంత చల్లబడింది. నిన్నమొన్నటిదాకా 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా దిగొచ్చాయి. ఆయా జిల్లాల్లోని‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకట్రెండు చోట్ల మాత్రమే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే.. మిగతా చోట్ల 44 లోపే రికార్డ్ అయ్యాయి. అయితే నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం హీట్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ట్ జిల్లాల్లో టెంపరేచర్లు 46 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 

అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్లీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో 46.4, కరీంనగర్ జిల్లాల్లో 46.2, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 46, మంచిర్యాల 46 డిగ్రీల మేర నమోదయ్యాయి. జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి.