Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ

Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) ఒక నటిగా, భార్యాగా, తల్లిగా మంచి గుర్తింపు పొందుతూ వస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌‌‌‌లో ఆలియా భట్ చక్రం తిప్పుతోంది. ఇటీవల కాలంలో గంగూబాయ్ కథియావాడి, బ్రహ్మాస్త్ర, డార్లింగ్స్, రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ, RRR, హార్ట్ ఆఫ్ స్టోన్ వంటి సినిమాలు తీసి తనదైన ముద్ర వేసుకుంది. 

తాజా విషయానికి వస్తే..పెళ్లయి, పాప పుట్టిన తర్వాత కూడా సినిమాల్లో తనదైన అందంతో నటిస్తూనే,అలాగే బయట కూడా రకారకాల చీరల్లో ఆలియా కనిపిస్తూ మురిపిస్తోంది.మెట్ గాలా 2024 మే 6న న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగింది.అలియా భట్ ఈ సంవత్సరం మెట్ గాలాలో(Met Gala) ఆడియన్స్ గుండెల్లో రైలు పరిగెత్తేలా అద్భుతమైన సబ్యసాచి పూల చీరను ధరించింది.

Also Read: ఫ్యామిలీ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 షురూ

గత సంవత్సరం మెట్ గాలాలో అరంగేట్రం చేసిన అలియా, ఈసారి సోషల్ మీడియాతో పాటు వరల్డ్ వైడ్ మొత్తం తనవైపు చూసేలా చేసింది. అంతర్జాతీయ రెడ్ కార్పెట్‌పై ఈ చీర ఎల్లప్పుడూ ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తుందని సోషల్ మీడియా నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలియా లుక్‌ని ఇంత అందంగా మలిచిన ఈ చీర యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. 

ఆలియాకే అందం తెచ్చిన చీర 

ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేశాడు.గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్ కు అతికినట్లు సరిపోయేలా భారతీయ సంస్కృతిని ఆమె మెట్ గాలాలో ధరించి గొప్పతనం ఉట్టిపడేలా ప్రపంచానికి చాటింది. ఈ సందర్భంగా ప్రముఖ మ్యాగజైన్ వోగ్ (Vogue)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలియా మాట్లాడుతూ.. "చీర కంటే కాలాతీతమైనది మరొకటి లేదు" అని చెబుతూ ఆ చీర, భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని ప్రతిబింబించేలా చేసింది. ఇంత అందానికి కారణమైన చీర అందుకు తగిన నగలతో ఆలియా అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ షోలో అలియా మాత్రమే కెమెరా కంటితో సహా చూసే ప్రతి ఒక్కరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. 

షిమ్మరీ శారీని డిజైన్ వెనుక కథ 

ఈ చీర వెనుక పెద్ద కథే ఉంది. ఈ చీరను తయారు చేయడానికి చాలానే శ్రమించాల్సి వచ్చిందని సమాచారం. ఏకంగా 163 మంది హస్త కళాకారులు 1905 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందంటే ఊహించుకోండి. ఈ మెట్ గాలా ఈవెంట్ రెడ్ కార్పెట్ పై ఆలియా ఇలా వరల్ద్ వైడ్ గా స్పెషల్ గా నిలవడానికి కారణం అయింది. ఇక ఆలియా భట్ స్టైల్ ను అనితా ష్రాఫ్ అడజానియా చూసుకోగా..పునీత్ సైనీ మేకప్.. అమిత్ ఠాకూర్ హెయిర్ స్టైలిస్ట్ గా ఉన్నాడు.

అయితే ఈ చీరను ఇండియాలో కాకుండా ఇటలీలో తయారు చేయడం విశేషం. ఈ మాస్టర్ పీస్ తయారు చేసిన కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది. ఆరు గజాల చీరతో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా తనదైన మాటలతో ఆలియా అక్కడి వాళ్ల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం అలియా భట్ మెరిసిన ఈ చీర గురుంచి సోషల్ మీడియాలో చర్చింకుంటున్నారు.