
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో ఇప్పటివరకూ వచ్చిన రెండు సీజన్స్ సూపర్ సక్సెస్ సాధించడంతో.. మూడో భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. వాళ్లందరికీ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వెబ్ సిరీస్ షూట్ మొదలైన విషయాన్ని ఫొటోస్‌తో తెలియజేసింది. ఒక ఫొటోలో క్లాప్ కనిపిస్తుండగా, మరొక ఫొటోలో డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేతో లీడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ ఉన్నాడు. ఓ వైపు దేశాన్ని కాపాడే స్పై ఏజెంట్‌గా, మరోవైపు మిడిల్ క్లాస్ మ్యాన్‌గా గత రెండు సీజన్స్‌లోనూ మనోజ్ నటన ఎంతో ఆకట్టుకుంది. ఇక అతనికి భార్యగా ప్రియమణి నటించింది. రెండో సీజన్‌లో సమంత కీ రోల్ చేసింది. కశ్మీర్ టెర్రరిజంపై ఫస్ట్ పార్ట్, ఎల్టీటీఈపై సెకెండ్ పార్ట్ తీసిన మేకర్స్.. ఈసారి ఎలాంటి కంటెంట్‌తో వస్తారో అనే అంచనాలు నెలకొన్నాయి.